రేపటి నుంచి ప్రారంభంకానున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 3పై నీలినీడలు కమ్ముకున్నాయి. మహిళలను కించపరిచే విధంగా ఉన్నా బిగ్ బాస్‌ను నిలిపివేయాలని ఓయూ విద్యార్థులు నాగార్జున ఇంటిని ముట్టడించారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరోవైపు నాగార్జున..స్టార్ మా ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఆయన షో హోస్ట్‌గా తప్పుకోవాలని నాగ్ భావిస్తున్నారని వార్తలు వెలువడుతుండగా బిగ్ బాస్ నిర్వాహకులు సైతం షోని వాయిదా వేసే ఆలోచనలో ఉన్నారట.
బిగ్‌బాస్ 3 వివాదంపై ఇద్దరు మహిళలు ఒంటరి పోరాటం చేస్తుంటే, నాగార్జున కనీసం స్పందించలేదని ఓయూ విద్యార్థులు మండిపడుతున్నారు. మహిళలను కించపరిచే షోకి నాగార్జున ఏ రకంగా హోస్ట్‌గా ఉంటారని ప్రశ్నిస్తున్నారు.
ర్నలిస్ట్ శ్వేతారెడ్డి, నటి గాయత్రి గుప్తా బిగ్ బాస్ నిర్వాహకులు తమతో అసభ్యంగా ప్రవర్తించారని పోలీసులకి ఫిర్యాదు చేశారు. కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి కూడా ఈ కార్యక్రమాన్ని బ్యాన్ చేయాలని కోరారు. హైకోర్టును ఆశ్రయించడంతో పాటు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరికి మద్దతుగా ఓయూ విద్యార్థులు ఆందోళన చేపట్టారు.