ఉస్మానియా వైద్యులు బాగా పని చేస్తున్నారు

373
Human
- Advertisement -

ఉస్మానియా ఆసుపత్రి వైద్యులు చాలా బాగా పనిచేస్తున్నారన్నారు హ్యూమన్ రైట్స్ కమీషన్ చైర్ పర్సన్ చంద్రయ్య. ఇవాళ ఆయన బృందంతో కలిసి ఉస్మానియా ఆస్పత్రిని సందర్శించారు. ఆస్పత్రిలో రోగుల పరిస్ధితిని అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉస్మానియా ఆసుపత్రి సేవలపై పేషంట్స్ సంతృప్తి గా వున్నట్లు తెలిపారు. వారి మాటలు వింటుంటే చాలా హ్యాపిగా అనిపించిందన్నారు. మా బృందం ఇక్కడికి మొదటిసారి వచ్చామని..ఇలాగే ముందు ముందు అన్ని ఆసుపత్రులకు వెళతాం అని చెప్పారు. హ్యూమన్ రైట్స్ ఇండిపెండెంట్ బాడీ అవ్వడంతో మాకు సర్వ అధికారాలు ఉంటాయి. ఆ అధికారాల తోటే ఇక్కడకు వచ్చినట్లు తెలిపారు. ఉస్మానియా ఆసుపత్రి పరిశుభ్రంగా ఉందన్నారు.

- Advertisement -