లండన్‌లో ఘనంగా ఓయూ శతాబ్ది ఉత్సవాలు

190
osmania 100 years celebrations in London
- Advertisement -

లండన్ లో ఉస్మానియా అలుమ్ని యూకే ,యూరోప్ ఆధ్వర్యం లో చారిత్రాత్మక ఇండియన్ జిన్ఖానా క్లబ్ లో చారిత్రాత్మక ఉస్మానియా శతాబ్ది ఉత్సవాలు ఘనం గా నిర్వహించారు . ఈ ఉత్సవాలకు ఉస్మానియా పూర్వ విద్యార్థి లార్డ్ కరణ్ బిలిమొరియా ( ఛాన్సలర్ , బర్మింగ్హామ్ యూనివర్సిటీ ) విశిష్ట అతిధిగా రాగా.. ఇండియా నుండి ముఖ్య అతిధులుగా ఉస్మానియా పూర్వ విద్యార్థులు నరపరాజు రాంచందర్ రావు( ఎమ్మెల్సీ ) ,ప్రొఫెసర్ పుట్టి మనోహర్ ( NCERT మెంబెర్ ,ఇండియా ) , డాక్టర్ దాసోజు శ్రవణ్ ( సోషల్ వర్కర్ ) , ఇండియా ఎంబస్సి నుండి అంబాసిడర్ విజయ్ వసంత్, అంబాసిడర్ నాగేశ్వర్ మరియు శ్రీ వీరేంద్ర శర్మ (MP ,లండన్ )లు పాల్గోన్నారు.

లార్డ్ బిలిమొరియా మాట్లాడుతూ మహాత్మాగాంధీ ప్రపంచానికే ఆదర్శనీయులని అన్నారు . పురాతన విశ్వవిద్యాలయాలకు చిరునామా భారత్ అని, ఆక్సఫర్డ్ యూనివర్సిటీ కి వందల ఏండ్ల ముందే నలంద ,తక్షశిల ఉన్నాయని ,అలాగే 100 ఏండ్ల చరిత్ర గల ఉస్మానియా నుండి నేను పట్టభద్రుణ్ణి అవడం గర్వపడుతున్నానని తెలిపారు . బ్రిటన్ ,ఇండియా దేశాల మధ్య విద్యాపరమైన అంశాలు పరస్పర సహకరించుకొని విద్యావిధానాన్ని మెరుగుపరుచుకోవాలని సూచించారు. దేశ సంపద సృష్టికర్త పివి నరసింహారావును దేశానికి అందించిన ఘనత ఒస్మానియదే అని మాజీ క్రికెటర్ ఆశబోగ్లే ,మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి లు తన క్లాసుమేట్ లు అని తెలిపారు .

ఉస్మానియా వైస్ ఛాన్సలర్ రామచంద్రం : వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ వీసా ,ప్రయాణ ఏర్పాట్లు అన్ని పూర్తి అయ్యి చివరి గంటల్లో అత్యవసర పనుల ద్వారా రాలేక పోతున్నాని… విశ్వవ్యాప్తంగా ఉస్మానియా విద్యార్థులు వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్నారని, అలాగే విదేశాల్లో 100 ఏండ్ల పండుగ నిర్వహణ అద్భుతమని ఉస్మానియా అభివృద్ధి లో బాగస్వాములవ్వాలని పిలుపునిచ్చారు . అలాగే ఉస్మానియా అలుమ్ని వ్యవస్థాపకులు గంప వేణుగోపాల్ ,రంగుల సుధాకర్ ,మహేష్ జమ్ముల ,సురేష్ మంగళగిరి లను అభినందించారు.

OU London meet

ఎన్ రామచందర్ రావు ( ఎమ్మెల్సీ ) మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది మేధావులను అందించిన ఘనత ఉస్మానియాదేనని ఉస్మానియా అభివృద్ధిలో ప్రతి ప్రవాస పూర్వ విద్యార్థి బాగస్వామ్యులవ్వాలని పిలుపునిచ్చారు . ఉస్మానియాతో తన కుటుంబానికి 80 ఏండ్ల అనుబంధాన్ని,ఉస్మానియా తో తమ కుటుంబ మూడు తరాల అనుబంధాన్ని పంచుకున్నారు .

పుట్టి మనోహర్ (NCERT మెంబెర్ ,ఇండియా ) మాట్లాడుతూ ఏ విధంగా హార్వర్డ్ యూనివర్సిటీ ప్రభుత్వ సహకారం లేకుండా అలుమ్ని ద్వారానే అభివృద్ధి చేసుకున్నట్లు ఉస్మానియా కూడా అలుమ్ని ద్వారా అభివృద్ధి చెందాలని , ఉస్మానియా గ్రేడింగ్ మెరుగు కొరకు పూర్వ విద్యార్థులు తమ మేధస్సు ను ఇవ్వాలని కోరారు . ప్రతి విశ్వవిద్యాలయం చదువును నేర్పుతుంది .ఉస్మానియా చదువు తో పాటు జీవితాన్ని నేర్పుతుందని తెలిపారు

దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ విదేశాల్లోని నాణ్యమైన విద్యావ్యవస్థ ,విజ్ఞాన సంపత్తి నిమన దేశానికి అందించే సహకారం చేయాలనీ అలుమ్ని ని కోరారు . నాణ్యమైన విద్యావ్యవస్థ విధి విధానాలను రూపొందించాలని కోరారు . ప్రవాసులు ఆర్ధికపర సహకారమే కాకుండా తమ మేధస్సు ను ,తమ నైపుణ్యత ని ఇచ్చి ఒస్మానియా అభివృద్ధి లో భాగస్వామ్యం అవ్వాలని పిలుపునిచ్చారు .

ప్రొఫెసర్ లింబాద్రి (శతాబ్ది ఉత్సవాల కన్వీనర్ ) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూజజ చివరి గంటల్లో అత్యవసర పనుల్లో రాలేక పోయానని లండన్ లో శతాబ్ది ఉత్సవాల నిర్వహణ ఉస్మానియా కె గర్వకారణమని తెలిపారు .

అంబాసిడర్ విజయ్ వసంత్ మాట్లాడుతూ విద్యావ్యవస్థ లో స్కిల్ డెవలప్మెంట్ అభివృద్ధి కి పాటుపడాలని కోరారు . గ్రామీణ విద్య కు కృషి చేయాలనీ ప్రవాసులకు పిలుపునిచ్చారు

వీరేంద్ర శర్మ ( ఎంపీ ,లండన్ ) ఉస్మానియా కి బ్రిటన్ ద్వారా ఏ రకమైన సహాయం కావాలన్న తన శక్తి మేరకు పని చేస్తానని తెలిపారు .

యూకే లో ఉస్మానియా అలుమ్ని ఏర్పాటు కు పునాదులు వేసిన వ్యవస్థాపకుడు గంప వేణుగోపాల్ ను లార్డ్ బిలిమొరియా ,రాంచందర్ రావు ,మనోహర్ రావు ,దాసోజు శ్రవణ్ లు ఘనం గ సన్మానించారు

సభాధ్యక్షులు గ అలుమ్ని అధ్యక్షులు రంగుల సుధాకర్ వ్యవహరించి కార్యక్రమాన్ని నడిపించారు . ప్రధాన కార్యదర్శి జమ్ముల మహేష్,కన్వీనర్ సురేష్ మంగళగిరి లు కార్యక్రమం విజయవంతం అవ్వడానికి కృషి చేసారు

కార్యక్రమం జ్యోతి ప్రజ్వలన తో ప్రారంభం అయ్యి ఉస్మానియా విద్యార్థులు రాగసుధ నృత్యం తో స్వాతి రెడ్డి దేశభక్తి గీతాలు పాడి పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు . అలాగే సమాజసేవలో బాగస్వామ్యులైన ఒస్మానియా పూర్వ విద్యార్థులకు శతాబ్ది ఉత్సవాల సన్మానం చేశారు . డా కిల్లి పద్మ , డా హరి ,శంకర్ దేవరశెట్టి , శివరాజ్ కిరణ్ పసునూరి, గీత ,కుమార్ ఉప్పల వారిని సన్మానించారు .

శ్యామ్ కుమార్ పిట్ల ,గుండా శ్రీనివాస్ ,మీనాక్షి ,రంగు వెంకట్ ,వాణి అనసూరి ,ఫారూఖ్ ,సత్య జిల్ల, తుకారాం ,వెంకట్ రెడ్డి , నరేందర్ , శ్రీధర్ మేడిశెట్టి ,శ్రీకాంత్ , తదితరులు ఈ కార్యక్రమం విజయవంతానికి కృషి చేశారు .

https://youtu.be/D0CMwwipxJw

- Advertisement -