ఆస్కార్ విన్నర్‌తో హరీష్ శంకర్..

479
harish director
- Advertisement -

గబ్బర్ సింగ్ ఫేం హరీష్ శంకర్‌-వరుణ్ తేజ్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం వాల్మీకి. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకురానుండగా వాల్మీకి సెట్స్‌లో దర్శనమిచ్చారు ఆస్కార్ విన్నర్ రాబర్ట్ రిచర్డ్‌ సన్‌. మూడు సార్లు ఆస్కార్ విజేతగా నిలిచిన ఆయన సినిమాలోని కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు.

ఈ విషయాన్ని హరీష్‌ శంకర్‌ ట్విటర్‌ ద్వారా తెలిపారు. మూడుసార్లు ఆస్కార్‌ విజేతగా నిలిచిన వ్యక్తి మన కోసం కెమెరా బాధ్యతల్ని నిర్వహిస్తే ఎలా ఉంటుంది? సినిమాటోగ్రఫీలో దేవుడులాంటి వ్యక్తి మా సెట్స్‌ని సందర్శించడం ఒక గొప్ప ఆశీర్వాదం. ఆయన కెమెరా పట్టగా, నేను యాక్షన్‌ చెప్పడం మరిచిపోలేని అనుభూతి కలిగించిందని తన ట్వీట్‌లో పేర్కొన్నారు. రాబర్ట్‌ రిచర్డ్‌సన్‌ సర్‌… ఈ క్షణాలు నా జీవితం చివరిరోజు వరకు గుర్తుంటాయి అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

వరుణ్‌ తేజ్‌ నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు మిక్కీ జే మేయర్‌ సంగీతమందిస్తున్నారు.

- Advertisement -