Oscar:ఇండియన్‌ సినిమాకు దక్కని చోటు

7
- Advertisement -

ఆస్కార్ నామినేషన్లు ప్రకటించబడిన నేపథ్యంలో ఈ ఏడాది కూడా భారతీయ సినిమాకు నిరాశే ఎదురైంది. ప్రతిష్ఠాత్మక అకాడమీ అవార్డుల పోటీలో ఒక్క భారతీయ చిత్రం కూడా చోటు దక్కించుకోకపోవడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రపంచ సినిమా వేదికపై భారతీయ ప్రతిభకు గుర్తింపు లభించకపోవడం అభిమానులను నిరుత్సాహపరిచింది.

ఈ ఏడాది ఆస్కార్ నామినేషన్లలో హాలీవుడ్ చిత్రం ‘సిన్నర్స్’ చరిత్ర సృష్టించింది. మొత్తం 16 విభాగాల్లో నామినేట్ అయి అత్యధిక నామినేషన్లు సాధించిన చిత్రంగా నిలిచింది. కథనం, దర్శకత్వం, సాంకేతిక విభాగాల్లో ఈ చిత్రం బలమైన పోటీని ఇస్తుందని సినీ విమర్శకులు అభిప్రాయపడుతున్నారు.

దీనితో పాటు ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అన్దర్’ 13 నామినేషన్లతో రెండో స్థానంలో నిలిచింది. ఇక ‘ఫ్రాంకెన్‌స్టైయిన్’, ‘మార్టీ సుప్రీం’, ‘సెంటిమెంటల్ వాల్యూ’ చిత్రాలు తలా 9 నామినేషన్లతో టాప్ జాబితాలో ఉన్నాయి. ‘హామ్నెట్’ 8 నామినేషన్లు సాధించగా, ‘బుగోనియా’, ‘ఎఫ్1’, ‘ది సీక్రెట్ ఏజెంట్’, ‘ట్రైన్ డ్రీమ్స్’ చిత్రాలు తలా 4 విభాగాల్లో నామినేట్ అయ్యాయి.

అలాగే ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’, ‘బ్లూ మూన్’, ‘ఇట్ వాజ్ జస్ట్ ఎన్ యాక్సిడెంట్’, ‘కెపాప్ డెమోన్ హంటర్స్’, ‘సిరాట్’ వంటి చిత్రాలు తలా 2 నామినేషన్లు దక్కించుకున్నాయి. ఆస్కార్ వేడుకలపై ఇప్పుడు ప్రపంచ సినీ ప్రేక్షకుల దృష్టి నెలకొంది.

Also Read:Mogudu:’మొగుడు’..టైటిల్ ప్రోమో

- Advertisement -