తెలుగు సినిమాను ప్రపంచంక పరిచయం చేసిన ఆర్ఆర్ఆర్. తాజాగా లాస్ ఎంజెల్స్‌లోని డాల్బీ థియేటర్స్‌లో ఏర్పాటు చేసిన ఆస్కార్ పండుగకు నాటునాటు సాంగ్‌కు ఆస్కార్ అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇదే స్టేజీపై రాహుల్ సిప్లిగంజ్ కాలభైరవ కలిసి నాటునాటు సాంగ్‌ను పాడి ఆలరించారు. అయితే దీనికి ముందు బాలీవుడ్ నటి దీపికా పదుకొనే ఈ పాటను ఇంట్రడ్యూస్ చేసింది.
విప్లకారులు అల్లూరి సీతారామరాజు కొమురం భీమ్ మధ్య స్నేహాన్ని చాటిచెప్పిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని కీలక సన్నివేశంలో వచ్చే పాట..నాటునాటు. వలసవాద వ్యతిరేక, వర్ణ వివక్షకు వ్యతిరేక సన్నివేశంలో పాడే పాటను…రాహుల్ సిప్లిగంజ్ కాలభైరవ పాడగా…చంద్రబోస్ సాహిత్యంకు కీరవాణి మ్యూజిక్కు ప్రపంచం మొత్తం దాసోహమైంది. యూట్యూబ్ టిక్‌టాక్‌లలో కోట్లాది వీక్షణలను సొంతం చేసుకుంది.
దీపికా పరిచయం తర్వాత రాహుల్ కాలభైరవ లైవ్‌లో పాడగా…వెస్ట్రన్ డ్యాన్సర్లు తమ డ్యాన్స్‌తో అలరించారు. ఈ పాట ప్రదర్శన సమయంలో ఆస్కార్ వేడుకకు వేదికైన డాల్బీ థియేటర్ మొత్తం కరతాళ ధ్వనులతో మారుమోగింది. ప్రస్తుతం ఇది నెట్టింట తెగ వైరల్ అవుతున్న వేళ దీపికా ఆర్ఆర్ఆర్ టీంని పొగడ్తల వర్షంలో ముంచెత్తుతున్నారు.
Here's the energetic performance of "Naatu Naatu" from #RRR at the #Oscars. https://t.co/ndiKiHeOT5 pic.twitter.com/Lf2nP826c4
— Variety (@Variety) March 13, 2023
Energy, optimism, partnership, winning against odds. #NaatuNaatu is not just a song: it’s a mini-epic movie. No wonder it had people everywhere rising to their feet. Even at the #Oscars I bow low to @ssrajamouli MM Keeravani & Chandrabose. 🙏🏽pic.twitter.com/6urWNclql5
— anand mahindra (@anandmahindra) March 13, 2023
ఇవి కూడా చదవండి…