ట్రిపుల్‌ తలాక్‌పై గందరగోళం..

243
Triple talaq
- Advertisement -

పార్లమెంట్ ఉభయ సభల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. పార్లమెంట్‌లో ట్రిపుల్ తలాక్‌ అంశంపై చర్చ సందర్భంగా గందరగోళం నెలకొనగా రాజ్యసభలో కావేరి నది అంశంతో అట్టుడికిపోయింది.ఉభయ స‌భలు ప్రారంభం కాగానే విప‌క్షాలు నినాదాల‌తో హోరెత్తించారు. స్పీక‌ర్ సుమిత్రా మ‌హాజ‌న్ .. స‌భ్యుల‌ను వేడుకున్నా ఎవ‌రూ వినిపించుకోలేదు. కావేరి న‌దిపై క‌ర్నాట‌క నిర్మిస్తున్న డ్యామ్‌ను నిలిపేయాల‌ని త‌మిళ‌నాడు ఎంపీలు రాజ్య‌స‌భ‌లో పట్టుబడట్టడంతో స‌భ‌ను రేప‌టికి వాయిదా వేశారు.

ఇక ట్రిపుల్‌ తలాక్‌ బిల్లుని జేపీసీకి పంపాలని కేంద్రాన్ని డిమాండ్ చేసింది కాంగ్రెస్‌. ట్రిపుల్‌ తలాక్‌ బిల్లుపై కూలంకషంగా చర్చించాల్సిన అవసరం ఉందని, దీన్ని సెలక్ట్‌ కమిటీకి పంపాలని లోక్‌సభలో కాంగ్రెస్‌పక్ష నేత మల్లిఖార్జున ఖర్గే విజ్ఞప్తి చేశారు.

ట్రిపుల్ తలాక్‌ బిల్లుపై కేంద్ర ప్రభుత్వం ఎవరినీ సంప్రదించలేదని హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ అన్నారు. ప్రజలు, ప్రతిపక్షాలు ఎవరినీ పరిగణనలోకి తీసుకోలేదని ఆక్షేపించారు. స్పీకర్‌ విచక్షణ అధికారాలు ఉపయోగించి దీన్ని సెలక్ట్‌ కమిటీకి పంపాలని ఆయన డిమాండ్‌ చేశారు.

బిల్లుపై చర్చకు సహకరించాలని కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ విజ్ఞప్తి చేసినా సభ్యులు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. ట్రిపుల్‌ తలాక్‌ బిల్లు ఏ వర్గాలకు వ్యతిరేకం కాదని, దీంతో ముస్లిం మహిళలకు రక్షణ కలుగుతుందని రవిశంకర్‌ ప్రసాద్‌ చెప్పారు.

- Advertisement -