తెలంగాణ‌కు మ‌రో భారీ పెట్టుబ‌డి- కేటీఆర్‌

38
ktr

తెలంగాణ‌ రాష్ట్రంలో పెట్టుబ‌డుల పెట్టేందుకు పలు పముఖ కంపెనీలు ముందు వస్తున్నాయి. ఇప్ప‌టికే ప్ర‌పంచ ప్ర‌ఖ్యాతి గాంచిన అమెజాన్, గూగుల్, ఫేస్‌బుక్, ఆపిల్ వంటి సంస్థల‌తో పాటు ఫియ‌ట్ క్రిస్ల‌ర్ సంస్థ కూడా పెట్టుబ‌డులు పెడుతున్న‌ట్లు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.

తాజాగా హైద‌రాబాద్‌కు మ‌రో భారీ పెట్టుబ‌డి వ‌స్తున్న‌ట్లు ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్ట‌ర్ వేదిక‌గా ప్ర‌క‌టించారు. హైద‌రాబాద్‌కు ఒప్పో 5జీ ఇన్నోవేష‌న్ ల్యాబ్ వ‌స్తుంద‌ని తెలిపారు. ఇది దేశంలోనే మొద‌టి 5జీ ఇన్నోవేష‌న్ ల్యాబ్ అని పేర్కొన్నారు. పెట్టుబ‌డుల‌కు హైద‌రాబాద్ సానుకూల‌మ‌ని మ‌రోసారి నిరూపిత‌మైంద‌ని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.