‘ఆపరేషన్ సింధు’.. భారత్ గొప్ప మనసు

5
- Advertisement -

ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో ఇరాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరాన్‌లో చిక్కుకున్న పలువురు విద్యార్థులను ‘ఆపరేషన్ సింధు’ ద్వారా స్వదేశానికి తీసుకొస్తుంది భారత్ . ఈ క్రమంలోనే తమ విద్యార్థులను కూడా సురక్షితంగా తరలించాలని భారత్‌ను కోరాయి పొరుగు దేశాలు నేపాల్, శ్రీలంక.

ఈ విషయమై అంగీకరించి పొరుగు దేశాల విద్యార్థులను తరలించి గొప్ప మనసు చాటుకుంది భారత్. తాజాగా ఇరాన్ నుంచి ఢిల్లీకి 290 మంది భారతీయులు చేరుకోగా ‘భారత్ మాతా కీ జై’ నినాదాలతో దద్దరిల్లింది ఎయిర్‌పోర్ట్‌.

ఇరాన్ నుంచి వచ్చిన వారిలో విద్యార్థులు, ధార్మిక యాత్రికులు, పర్యాటకులు ఉన్నారు. క్లిష్ట సమయంలో తమను రక్షించిన భారత భారత ప్రభుత్వానికి వారు కృతజ్ఞతలు తెలిపారు. ఆపరేషన్ సింధు కింద 290 మంది భారతీయులను ఇరాన్ నుంచి తీసుకొచ్చాం. వీరిలో విద్యార్థులు, ధార్మిక యాత్రికులు ఉన్నారు. ఇరాన్ ప్రభుత్వానికి భారత తరఫున ధన్యవాదాలు అని పేర్కొన్నారు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్.

Also Read:TTD:భక్తులను మోసం చేస్తే కఠిన చర్యలు

- Advertisement -