హైదరాబాద్ వేదికగా జరిగిన 72వ మిస్ వరల్డ్ పోటీలు ముగిశాయి. మిస్ వరల్డ్ 2025గా నిలిచింది థాయ్‌లాండ్ భామ ఓపల్ సుచాత చువాంగ్. ప్రపంచవ్యాప్తంగా వందకు పైగా దేశాల నుంచి పోటీపడిన సుందరీమణులను తన అందం, అభినయం, ప్రతిభతో దాటుకుని విజేతగా నిలిచారు.
ఇటీవలే మిస్ వరల్డ్ థాయ్లాండ్-2025ను ఆమె గెలుచుకున్నారు. థాయ్‌లో పుట్టిన ఓపల్‌ఖు ఇంగ్లీష్, చైనీస్ భాషల్లో మంచి ప్రావీణ్యం ఉంది. మోడలింగ్ పై మక్కువతో అందాల పోటీల్లో పాల్గొన్నారు.
16 ఏళ్ల వయసులో రొమ్ములో కణితితో బాధపడ్డారు సుచాత. అది క్యాన్సర్ కాదని తేలడంతో క్యాన్సర్ తో బాధపడే వారి పరిస్థితిని అర్ధం చేసుకున్నారు. దీంతో వ్యాధిపై అవగాహన పెంచడానికి.. ఓపల్ ఫర్ హెర్ ప్రాజెక్ట్ ప్రారంభించారు. రొమ్ము క్యాన్సర్ పై అవగాహన కల్పించి.. తొలి దశలోనే గుర్తించడమే ప్రాజెక్ట్ ముఖ్యోద్దేశం. ఇందుకు నిధుల సేకరిస్తూ, కొన్ని సంస్థలతో కలిసి పని చేస్తున్నారు. ధమ్మసాట్ విశ్వవిద్యాలయంలో పొలిటికల్ సైన్స్ అభ్యసిస్తున్నారు.
Also Read:తెలంగాణ జాతిపితకు నోటీసులా?:కవిత


