హాలీవుడ్ కు వెళ్తోన్న నాగార్జున

235
Oopiri Will Have A Hollywood Remake
- Advertisement -

అక్కినేని నాగార్జున, కార్తీ ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఊపిరి’ సినిమా త్వరలోనే హాలీవుడ్ లో రీమేక్ కాబోతుంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ‘ది అప్ సైడ్’ అనే టైటిల్ తో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఫ్రెంచ్ లో తెరకెక్కిన ‘ది ఇన్‌టచబుల్స్’ సినిమాను తెలుగులో ‘ఊపిరి’ పేరుతో రీమేక్ చేయగా అది నాగార్జున కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అంతేకాదు 2016లో టాప్ బ్లాక్ బాస్టర్ సినిమాల్లో ఒకటిగా నిలిచిన సంగతి తెలిసిందే.

హాలీవుడ్ రీమేక్ లో నాగ్ పాత్రని బ్రియన్ క్రాన్ స్టాన్ పోషించనుండగా, కార్తీ పాత్రలో కెవిన్ హర్ట్ , మిల్కీ బ్యూటీ తమన్నా పాత్రలో హాలీవుడ్ లేడీ నికోల్ కిడమన్ నటించనుంది. ఈ సినిమాకి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మరి ఇప్పుడు ఇంగ్లీష్ లోకి వెళ్తోన్న ఈ రీమేక్ అక్కడ ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటుందో చూడాలి!

- Advertisement -