- Advertisement -
దేశంలోని అతపెద్ద క్యాబ్ హైరింగ్ సంస్థ అయిన ఓలా..సరికొత్త రంగంలోకి అడుగుపెడుతోంది. ఓలా న్యూస్ నెట్వర్క్ పేరుతో జర్నలిజం రంగంలోకి అడుగుపెట్టింది. ఇందుకు సంబంధించిన వీడియోను యూట్యూబ్లో విడుదల చేసింది. సోషల్ మీడియాలోనూ హల్చల్ చేస్తున్న ఈ వీడియో అంచనాలకు మించి ఉందని నెటిజన్లు చెబుతున్నారు. పది లక్షల మంది డ్రైవర్లతో దేశంలోని 110 నగరాల్లో సేవలు అందిస్తున్న ఓలా జర్నలిజంలోకి ప్రవేశించడం చర్చనీయాంశంగా మారింది.
మరోవైపు తన వ్యాపార విస్తరణలో భాగంగా ఓలా-ఉబెర్ వీలినంపై చర్చలు మొదలయ్యాయి. ఈ రెండు కంపెనీల్లోనూ పెట్టుబడులు పెట్టిన జపాన్ కంపెనీ సాఫ్ట్ బ్యాంకు ఈ మేరకు చొరవ తీసుకుంటోంది. దీనిపై ఓలా అధికార ప్రతినిధి స్పందిస్తూ.. కార్యకలాపాల విస్తరణకు అన్వేషణ ఎప్పుడూ ఉంటుందని స్పష్టం చేశారు.
- Advertisement -