ఆన్‌లైన్‌లో నామినేషన్‌ వేయొచ్చు : వికాస్‌ రాజ్‌

19
- Advertisement -

లోక్‌ సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఆన్‌లైన్‌లోనూ నామినేషన్‌ దాఖలు చేయవచ్చని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌ రాజ్‌ తెలిపారు.అయితే, ఈ నెల 24లోగా ప్రింట్‌ తీసుకొని సంబంధిత రిటర్నింగ్‌ అధికారికి అందజేయాలన్నారు. హైదరాబాద్‌ లోఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

నామినేషన్‌ పత్రాలు, అఫిడవిట్‌ జాగ్రత్తగా నింపాలని సూచించారు. మూడు సెట్ల నామినేషన్‌ పత్రాలు ఇవ్వొచ్చని, వాటితోపాటు 5 ఫొటోలు ఇవ్వాలని తెలిపారు.అఫిడవిట్‌లోని ప్రతి పేజీలో సంతకం చేయాలని, ప్రతి కాలమ్‌ నింపాలని చెప్పారు. ఎన్నికల ఖర్చుపై అభ్యర్థి బ్యాంకు ఖాతా ఓపెన్‌ చేయాలి.

ఫొటోల విషయంలో అభ్యర్థులు చాలా జాగ్రత్త వహించాలి. టోపీలు, కళ్లద్దాలు పెట్టుకొని ఫొటోలు దిగరాదు. కనీసం రెండు నెలల ముందు తీసుకున్న ఫొటోలను మాత్రమే అందజేయాలి. అభ్యర్థుల ముఖాలు స్పష్టంగా ఉండేలా జాగ్రత్త పడాలి’’ అని వికాస్‌రాజ్‌ తెలిపారు.

Also Read:A3 లేబుల్స్ బ్యానర్‌పై బుల్లెట్ బండి లక్ష్మణ్

- Advertisement -