పెళ్లి అంటే వేదిక మీద…వధువు వరుడు ఒక్కదగ్గరికి చేరి నలుగురి సమక్షంలో…పెద్దల అంగీకారంతో ఒక్కటౌవుతారు. అదే ప్రేమ పెళ్లిళ్లు అయితే రిజిస్ట్రర్ మ్యారేజ్ లేక ఇకేందో చేసుకుంటారు. కానీ ఇప్పుడు కొత్తగా ఆన్లైన్ మ్యారేజ్లు కూడా జరుగుతున్నాయి. మొన్నటి వరకు ఫేస్ బుక్ ప్రేమలు..ఆన్లైన్ పెళ్లి చూపులు విన్నాం…ఇక నుంచి ఆన్లైన్ పెళ్లిలు కూడా చూడబోతున్నాం. వరుడు..వధువు ఒక్క దగ్గర లేకపోయినా..పెళ్లి చేసేయోచ్చు. తాజాగా ఆన్లైన్లో పెళ్లి జరిగిన సంఘటన కేరళలో చోటు చేసుకుంది. పెళ్లికి సెలవు ఇవ్వకపోవడంతో వధూవరులు ఆన్లైన్లోనే వివాహం చేసుకున్నారు.
కేరళలోని కొల్లం జిల్లాకి చెందిన హారిస్.. సౌదీ అరేబియాలోని ఓ కంపెనీలో మార్కెటింగ్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. హారిస్‌కి కేరళకి చెందిన శ్యామలతో వివాహం నిశ్చయమైంది. కానీ కొన్ని కారణాల నిమిత్తం హారిస్‌కి కంపెనీ సెలవు ఇవ్వలేదు. దాంతో వరుడు వివాహ సమయానికి కేరళ రాలేకపోయాడు. దాంతో వధూవరుల కుటుంబాలు ఆందోళన చెందాయి. అనుకున్న సమయానికే పెళ్లి జరిపించాలని నిశ్చయించుకుని ఆన్‌లైన్‌ను ఆశ్రయించారు. హారిస్ ఆన్లైన్లో వివాహ తంతు చూస్తుండగా అతని బదులు వధువుకు వరుడిస్ సోదరి నజిత తాళి కట్టింది. అలా ఆన్లైన్ వివాహం ద్వారా వధూవరుల ఒక్కటయ్యారు.