ఆన్‌లైన్ కిడ్నీ రాకెట్ గుట్టురట్టు చేసిన పోలీసులు..

268
Rachakonda police
- Advertisement -

ఆన్‌లైన్‌లో కిడ్నీలు కొనబడును దీనికి భారీగా డబ్బులు చెల్లిస్తాం అని పేర్కొంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న తమిళనాడు రాష్ట్రం మధురై జిల్లాకు చెందిన సూర్య శివరాం శివను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నేషనల్ కిడ్నీ ఫెడరేషన్ పేరుతో గూగుల్ ద్వారా సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటూ ఒక్కొక్క కిడ్నీ దాదాపు 30 లక్షలు ఇస్తామంటూ మోసాలకు పాల్పడుతున్నాడు.

ఇతను ముఖ్యంగా పేదవాళ్లను టార్గెట్ చేసుకుంటూ మోసాలకు పాల్పడుతున్నాడు. దీనికి సంబంధించి ఒక వ్యక్తి ఫిర్యాదు మేరకు ఎస్ఓటీ పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేసి ఆన్‌లైన్‌లో అడ్వాయిజ్మెంట్ చేస్తూ కిడ్నీ అవసరం ఉన్న అమాయకులను పెద్ద ఎత్తున మోసం చేస్తున్న మదురైకి చెందిన సూర్యశివరాం శివను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇతడి దగ్గర నుంచి ఫేక్ డాకుమెంట్స్, సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.  ఆన్‌లైన్‌లో వచ్చేటువంటి ఈ ప్రచారాన్ని ప్రజలు నమ్మి మోసపోవద్దని ఈ సందర్భంగా రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్‌ విజ్ఞప్తి చేశారు.

- Advertisement -