ట్రేడింగ్ పేరుతో తేజ కొడుకుకి టోకరా!

5
- Advertisement -

డైరెక్టర్ తేజ కుమారుడు అమితవ్ తేజ ట్రేడింగ్ పేరుతో మోసానికి గురయ్యాడు. ఈ ఘటన హైదరాబాద్‌లో సంచలనం కలిగిస్తోంది. ట్రేడింగ్‌లో అధిక లాభాలు వస్తాయని నమ్మించి ఒక దంపతులు అమితవ్ తేజ నుంచి సుమారు రూ.72 లక్షలు కాజేశారని ఆరోపణలు ఉన్నాయి.

బాధితుడి వివరాల ప్రకారం, సదరు దంపతులు స్టాక్ మార్కెట్ ట్రేడింగ్, పెట్టుబడుల పేరుతో తనను నమ్మించి విడతల వారీగా భారీ మొత్తాన్ని తీసుకున్నారని తెలుస్తోంది. మొదట్లో కొంత లాభం చూపించి విశ్వాసం పెంచుకున్న వారు, తర్వాత డబ్బు తీసుకుని సంబంధాలు తెంచుకున్నట్లు అమితవ్ తేజ ఫిర్యాదులో పేర్కొన్నారు.

డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగితే తప్పించుకుంటూ వచ్చారని, చివరకు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి కనిపించకుండా పోయారని ఆయన ఆరోపించారు. దీంతో చేసేదేమీ లేక జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో అమితవ్ తేజ అధికారికంగా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సంబంధిత బ్యాంక్ లావాదేవీలు, కాల్ డేటా, ట్రేడింగ్ అకౌంట్ల వివరాలను పోలీసులు పరిశీలిస్తున్నట్లు సమాచారం.

Also Read:శ్రేయాస్‌ను ఇమిటేట్ చేసిన విరాట్!

- Advertisement -