వన్ప్లస్ డాష్ సేల్.. రూపాయి మాత్రమే

195
OnePlus Diwali Dash Sale from October 24-26
OnePlus Diwali Dash Sale from October 24-26
- Advertisement -

పండుగలను క్యాష్‌ చేసుకోవడంలో కంపెనీలు పోటీ పడతాయనడంలో సందేహం లేదు. తాజాగా వచ్చే దీవాళిని చైనీస్ హ్యాండ్ సెట్ మేకర్ వన్ ప్లస్ కూడా క్యాష్ చేసుకోవాలని బంపర్ ఆఫర్ ప్రకటించింది. డాష్ ఫర్ దివాళి పేరిటి రానున్న ఈ ఫెస్టివల్ లో మీరు రూపాయికే వన్‌ప్లస్ ఫోన్లు సొంతం చేసుకునే అద్భుత అవకాశాన్ని కల్పిస్తోంది. మరి అదెలాగో చూద్దాం.

ఈ ఈవెంట్ అక్టోబర్ 24 అలాగే అక్టోబర్ 26 ఈ రెండు రోజుల్లో జరుగుతుంది. ఈ రెండు రోజుల్లో 12 PM, 4 PM and 8 PM మధ్యలో వన్‌ప్లస్ డాష్ ఫర్ దివాళి ఫ్లాష్ సేల్స్ నిర్వహిస్తోంది. ఈ పోటీలో పాల్గోనాలనుకునేవారు ముందుగా నాలుగు స్టెప్పుల రిజిస్ట్రేషన్ ప్రాసెస్‌ని పూర్తి చేయాలి. ముందుగా వన్ ప్లస్ స్టోర్ లో అకౌంట్ తెరిచి, డాష్ సేల్ లో రిజిస్టర్ కావాలి. మొబైల్ నంబర్ వెరీఫికేషన్ ఉంటుంది. ఆ తరువాత మీ అడ్రస్‌ని ఇవ్వాలి. చివర్లో మీ రిజిస్ట్రేషన్ని సోషల్ మీడియాలో మీ ఫ్రెండ్స్‌కి #OnePlusDiwaliDashని జతచేస్తూ షేర్ చేయాలి. అపుడు మీ రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. అపుడు మాత్రమే డాష్ సేల్ లో ఎంట్రీ లభిస్తుంది. ఆ తరువాత ఆ రోజుకు సంబంధించి కొన్ని మిస్టరీ బాక్సలను కంపెనీ రిలీజ్ చేస్తుంది.

OnePlus-Diwali-Dash-Festival

ఒక్కొక్క ఖాతాదారుడు ఒక్కో బాక్స్ డ్రా చేసే అవకాశం ఉంటుంది. ఈ లక్కీ బాక్స్ లో ఏముందో తెలుసుకోవాలంటే..ఒక రూపాయి ఖచ్చితంగా చెల్లించాలి. అపుడు మాత్రమే బాక్స్ ఒపెన్ అవుతుంది. మూడు గంటలలోపు చెల్లించడంలో ఫెయిల్ అయితే.. బాక్స్ డ్రా చేసే అవకాశం మిస్ అయినట్టే. అయితే మీరు ఎన్ని బాక్సులనైనా కొనచ్చు. వన్ ప్లస్‌ మొబైల్ యూజర్లకు స్పెషల్‌గా రూ.250 కూపన్ గెలుచుకునే అవకాశం కూడా ఉంది. వన్ ప్లస్ యూజర్లు ముందుగా తమ ఐఎంఈఐ నంబర్‌తో రిజిస్టర్‌ కావాల్సి ఉంటుంది.

మరోవైపు మీరు మళ్లీ డ్రా బాక్స్ డ్రా చేయడం అనేది మీ డాష్ లెవల్ ను బట్టి ఉంటుంది. వన్ ప్లస్ సైట్ రిజిస్టర్ కోసం స్నేహితులకు పంపే రిక్వెస్టులు, వన్ ప్లస్ సోర్ల ద్వారా ఇతర మొబైళ్ల కొనుగోలు తదితర అంశాలను బట్టి ఈ లెవల్ నిర్ణయించబడుతుందని కంపెనీ వెబ్ సైట్ లో ప్రకటించింది.

- Advertisement -