వన్డే మ్యాచ్‌లకు భారత జట్టు ఖరారు

41
- Advertisement -

రెండో టెస్ట్‌ విజయంతో భారత క్రికెట్ మండలి మూడవ, నాలుగవ టెస్ట్‌ మ్యాచ్‌లకు తదుపరి వన్డే మ్యాచ్‌లకు నూతన జట్లను ప్రకటించింది. బోర్డ‌ర్ – గ‌వాస్క‌ర్ ట్రోఫీ రెండో టెస్టులో భార‌త్ 6 వికెట్ల తేడాతో ఆసీస్‌పై గెలుపొందింది. అయితే రంజీ ట్రోఫీ పైనల్ మ్యాచ్ సందర్భంగా జయదేవ్ ఉన్‌ద్కత్ రెండు టెస్టులకు దూరమయ్యారు. కానీ చివరి రెండు టెస్టులకు జయ్‌దేవ్‌ను ఎంపిక చేసింది. ఇందోర్‌ వేదికగా మార్చి1 నుంచి మూడో టెస్టు జరగ్గా…నాలుగో టెస్టు మార్చి 9-13న అహ్మదాబాద్‌లో జరగనుంది.

టెస్టు జ‌ట్టుః రోహిత్ శ‌ర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, శుభ్‌మ‌న్ గిల్, ఛ‌టేశ్వ‌ర్ పూజారా, విరాట్ కోహ్లీ, కేఎస్ భ‌ర‌త్ (వికెట్ కీప‌ర్), ఇషాన్ కిష‌న్ (వికెట్ కీప‌ర్), శ్రేయాస్ అయ్య‌ర్, ర‌విచంద్ర‌న్ అశ్విన్, అక్ష‌ర్ ప‌టేల్, కుల్దీప్ యాద‌వ్, ర‌వీంద్ర జ‌డేజా, మ‌హ‌మ్మ‌ద్ ష‌మీ, మ‌హ‌మ్మ‌ద్ సిరాజ్, ఉమేశ్ యాద‌వ్, జ‌య‌దేవ్ ఉనాద్క‌త్.

భారత ఆస్ట్రేలియా మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆదివారం బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. కాగా భారత కెప్టెన్ రోహిత్ శర్మ మొదటి వన్డేకు దూరం కానున్నారు. మొదటి వన్డే మ్యాచ్‌ మార్చి 17న ముంబైలో, మార్చి 19న విశాఖపట్నం, మార్చి22న చివరి వన్డేను చెన్నైలో తలపడనున్నాయి.

వ‌న్డే జ‌ట్టుః రోహిత్ శ‌ర్మ (కెప్టెన్), శుభ్‌మ‌న్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యార్, సూర్య‌కుమార్ యాద‌వ్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిష‌న్ (వికెట్ కీప‌ర్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), ర‌వీంద్ర జ‌డేజా, కుల్దీప్ యాద‌వ్, వాషింగ్ట‌న్ సుంద‌ర్, య‌జువేంద్ర చాహ‌ల్, మ‌హ‌మ్మ‌ద్ ష‌మీ, మ‌హ‌మ్మ‌ద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, శార్దూల్ ఠాకూర్, అక్ష‌ర్ ప‌టేల్, జ‌య‌దేవ్ ఉనాద్క‌త్.

ఇవి కూడా చదవండి…

విరాట్‌…రికార్డుల కింగ్

రెండో టెస్ట్‌లో స్పీన్‌ మాయాజాలం…

ఆసీస్ 113 ఆలౌట్..భారత్ టార్గెట్ 115

- Advertisement -