వన్ స్టేట్… వన్ డిజిటల్ కార్డ్

4
- Advertisement -

రాష్ట్రంలో ఫ్యామిలీ డిజిటల్ కార్డులు ఇవ్వాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. ప్రతీ నియోజకవర్గంలో ఒక అర్బన్, ఒక రూరల్ ప్రాంతాన్ని ఎంచుకుని పైలట్ ప్రాజెక్టు చేపట్టాలని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. పైలట్ ప్రాజెక్టుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు.

రేషన్, హెల్త్ ప్రొఫైల్ తో పాటు సంక్షేమ పథకాలన్నిటికీ ఇక ఒకే కార్డు ఉండనుంది. వన్ స్టేట్… వన్ డిజిటల్ కార్డ్ విధానంతో ముందుకెళ్లాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. ఫ్యామిలీ డిజిటల్ కార్డుతో ఎక్కడైనా సంక్షేమ పథకాలను పొందేలా చర్యలు చేపట్టారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డుతోనే కుటుంబ సభ్యులందరికీ ఆరోగ్య సేవలు అందనున్నాయి.

అందులో ప్రతీ ఒక్కరి హెల్త్ పొఫైల్ ఉండాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అర్హులందరికీ ఫ్యామిలీ డిజిటల్ కార్డులు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు సీఎం. ఫ్యామిలీ డిజిటల్ కార్డుల మానిటరింగ్ కు జిల్లాలవారీగా ఒక వ్యవస్థ ఉండాలని సూచించారు రేవంత్. ఇందుకోసం రాజస్థాన్, హర్యానా, కర్ణాటక లాంటి ఇతర రాష్ట్రాల్లో అమలులో ఉన్న విధానాలను అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు.

Also Read:లక్నో స్మార్ట్ సిటీని సందర్శించిన మేయర్ బృందం

- Advertisement -