ఒకే రాష్ట్రం.. ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణే మా నినాదం అన్నారు ఏపీ మంత్రి నారా లోకేష్. గుత్తి మండలం బేతపల్లిలో రెన్యూ విద్యుత్ కాంప్లెక్స్ కు భూమిపూజ చేశారు లోకేష్.
అనంతరం మాట్లాడిన లోకేష్… అనంతపురానికి కియా మోటార్ల పరిశ్రమ తెచ్చాం. మేక్ ఇన్ ఇండియా ద్వారా రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడు వస్తాయన్నారు .పీక్ అవర్స్ లో గ్రిడ్ విశ్వసనీయతను పెంచడమే కాకుండా .. క్లీన్ ఎనర్జలో ఏపీని నేషనల్ లీడర్ గా నిలబెడుతుంది . ఈ ప్రాజెక్టుతో ప్రత్యక్షంగా, పరోక్షంగా 1500 ఉద్యోగాలు వస్తాయన్నారు.
2.8 గిగా వాట్ విండ్ మరియు సోలార్ ఉత్పత్తి సామర్థ్యం. 1.8 GWP సోలార్ పవర్, 1 GW విండ్ పవర్. రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టులో 2 GWH బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్. 2,300 ఎకరాల్లో రూ.22 వేల కోట్లతో రెన్యూవబుల్ ఎనర్జీ కాంప్లెక్స్ నిర్మాణం జరగబోతుందన్నారు. పవన, సోలార్, బ్యాటరీ ఆధారిత విద్యుత్ ఉత్పత్తి కాంప్లెక్స్ నిర్మాణం. భవిష్యత్ ఆశలు, ఆకాంక్షల వారధిగా రెన్యువబుల్ ఎనర్జీ కాంప్లెక్స్ అన్నారు.
రెన్యువబుల్ ఎనర్జీ పరిశ్రమ మాత్రమే కాదు.. ఉద్యమం. భారత క్లీన్ ఎనర్జీ విప్లవానికి శంకుస్థాపన చేశాం. రాబోయే రోజుల్లో ప్రతిరోజూ 4 పీక్ గంటల వరకు విద్యుత్ సరఫరా. మొదటి దశలో RENEW 587 MWP సౌరశక్తి, 250MWH పవన శక్తి సామర్థ్యంతో ఏర్పాటు. 100శాతం మేడ్-ఇన్-ఇండియా సోలార్ ప్యానెల్స్ వినియోగం చేస్తామన్నారు.
Also Read:War 2:ఎన్టీఆర్‌పై హృతిక్!

