ఒకే దేశం- ఒకే రేషన్ కార్డు

572
pashwan
- Advertisement -

ఒకే దేశం- ఒకే రేషన్ కార్డు విధానాన్ని ఆన్ లైన్ ద్వారా తెలంగాణలో అమలు చేశారు కేంద్ర పౌరసఫరాల శాఖ మంత్రి రాం విలాస్ పాశ్వాన్. , వన్ నేషన్ వన్ రేషన్ కార్డులో భాగంగా సెకండ్‌ క్లస్టర్‌లో ఏపీ,తెలంగాణ, మహారాష్ట్ర, గుజరాత్ లను ఏర్పాటు చేసి కేంద్ర పౌరసరఫరాల శాఖ మంత్రి రాం విలాస్ పాశ్వాన్ ప్రారబించారు . రాష్ట్రంలో ఇప్పటికే ఇది అమలు లో ఉండగా….హైదరాబాద్ లో ఈ రేషన్ పొర్టబిలిటి అందుబాటులో ఉంది.అన్ని జిల్లాలో ఇది అందుబాటులో ఉంది.ఎక్కడి నుండైన రేషన్ తీసుకొనే వెసులుబాటు దీని ద్వారా సులభం అవుతుంది.

ఒకే దేశం ఒకే రేషన్ కార్డు లక్ష్యం దిశగా చర్యలు చేపడుతున్నట్టు మంత్రి పాశ్వాన్ పేర్కొన్నారు. ఇందుకోసం ప్రజా పంపిణీ విధానానికి సంబంధించి వ్యవస్థను కంప్యూటీకరించడం, ఆహార ధాన్యాల పంపిణీ, నిల్వల విషయంలో పారదర్శకత, ఎఫ్‌సీఐ, సీడబ్యూసీ, ఎన్‌డబ్యూసీ డిపోలను ఆన్‌లైన్ విధానంతో అనుసంధానిస్తుమని చెప్పారు.

ఈ విధానంతో రేషన్ కార్డు ఉన్న వారికి ప్రయోజనం కలుగుతుందని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ఉపాధి కోసం తమ ప్రాంతం నుంచి మరో చోటుకు వెళ్లే వారి ప్రయోజనకరంగా ఉంటుందని తెలిపారు.

- Advertisement -