Modi: 2047 నాటికి వికసిత్ భారతే లక్ష్యం

7
- Advertisement -

2047 నాటికి వికసిత్ భారతే లక్ష్యమన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఢిల్లీలోని ఎర్రకోటలో 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేసిన మోడీ జాతినుద్దేశించి ప్రసంగించారు. దేశం కోసం పోరాడిన మహనీయులను స్మరించుకుందామని పిలుపునిచ్చారు.

భారత్‌ను ప్రపంచ నైపుణ్యాల రాజధానిగా మార్చాలని.. తయారీరంగంలో గ్లోబల్‌ హబ్‌గా భారత్‌ని తీర్చిదిద్దాలన్నారు. ప్రపంచానికే అన్నంపెట్టే స్థాయికి భారత్‌ ఎదగాలని.. దేశాభివృద్ధికి పాలనా సంస్కరణలు అవసరమన్నారు. వోకల్‌ ఫర్‌ లోకల్‌ అనేది ప్రభుత్వ వ్యూహమని.. వోకల్‌ ఫర్‌ లోకల్‌ నినాదం ఆర్థిక వ్యవస్థలో మార్పులు తీసుకువచ్చిందని చెప్పారు.

అభివృద్ధి బ్లూప్రింట్‌గా సంస్కరణలు తీసుకువస్తున్నామని.. నేషన్‌ ఫస్ట్‌.. రాష్ట్ర్‌ హిత్‌ సుప్రీం సంకల్పంతో ముందుకెళ్తున్నామన్నారు. బ్యాంకింగ్‌ రంగంలో ఎన్నో సంస్కరణలు అమలు చేశామని తెలిపారు. భారత బ్యాకింగ్‌ వ్యవస్థ ప్రపంచంలోనే బలమైందని.. జల్‌జీవన్‌ మిషన్‌ ద్వారా 15కోట్ల మందికి లబ్ధి చేకూరిందన్నారు. యువతకు నూతన ఉపాధి అవకాశాలు అందుబాటులో ఉన్నాయన్నారు. స్వాతంత్య్రం కోసం ఆనాడు 40కోట్లమంది ప్రజలు పోరాడారని.. ఇప్పడు దేశ జనాభా 140 కోట్లకు పెరిగిందని చెప్పారు.

Also Read:జూనియర్ ఎన్టీఆర్ కు రోడ్డు ప్రమాదంపై వదంతులు

- Advertisement -