ఐదేళ్లలో సమిష్టిగా సరికొత్త భారతావనిని ఆవిష్కరిద్దామని తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. 73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేశారు మోడీ. త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జాతిని ఉద్దేశించి మాట్లాడిన మోడీ …స్వాంతంత్ర్య సమరయోధులకు వందనం తెలిపారు. దేశం కోసం ప్రాణాలర్పించి ప్రతి ఒక్కరికి వందనం చెప్పారు.
దేశ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని చెప్పారు. 10వారాల్లో దేశం కోసం ఎన్నో కీలకమైన నిర్ణయాలు తీసుకున్నాం…ట్రిపుల్ తలాక్ రద్దు చేసి ముస్లిం మహిళలకు అండగా నిలిచామని చెప్పారు. ముస్లిం మహిళలకు ఇప్పుడు సమాన హక్కులు లభించాయి…చిన్నారులపై లైంగిక వేధింపులను నివారించేందుకు కఠిన చట్టాలు తీసుకువస్తామని తెలిపారు.
దేశం మారుతుందన్న భావన ప్రతి ఒక్కరిలో ఉంది..అన్ని వర్గాల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని చెప్పారు. ఆర్టికల్ 370 రద్దుతో పటేల్ ఆకాంక్షను నెరవేర్చాం… ఆర్టికల్ 370 రద్దుతో కాశ్మీర్ ప్రజలకు పూర్తి స్వేచ్ఛ వచ్చిందన్నారు. అన్ని పార్టీలు ఆర్టికల్ 370 రద్దును సమర్థించాయని చెప్పారు. జమ్మూ కాశ్మీర్‌లో ఉన్న అన్ని వర్గాల ప్రజలకు సమాన హక్కులు దక్కాలి…జమ్మూలో శాంతి స్థాపనే మా లక్ష్యమని స్పష్టం చేశారు. దేశంలో అనేక ప్రాంతాలు వరదల్లో చిక్కుకుపోయాయి…. వరదల్లో చనిపోయిన వారికి నివాళి అర్పించారు. దేశ ప్రజలందరికి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు చెప్పారు.