గుడ్ న్యూస్.. లక్ష యూఎస్‌ వీసాలు

123
- Advertisement -

ఉన్నత విద్య అభ్యసించేందుకు అమెరికా వెళ్లాలనుకునే విద్యార్థులకు ఇది శుభవార్తే. అమెరికాలో జనవరి నుంచి ప్రారంభమయ్యే విద్యా సంవత్సరానికి గాను వీసా దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభించేందుకు అక్కడి ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. గత విద్యాసంవత్సరంలో ఏకంగా 82 వేల మంది విద్యార్థులకు ఎఫ్-1 వీసాలు జారీ చేసిన అమెరికా ఈసారి అంతకుమించి వీసాలు జారీ చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా వీసా జారీ ప్రక్రియలో భారతీయ విద్యార్థులకు పెద్దపీట వేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం పర్యాటక, విద్యార్థి, ఇతర వీసాల కోసం 400 రోజులకుపైగా ఎదురుచూడాల్సి వస్తోంది. మరోవైపు, అక్టోబరులో కొన్ని, నవంబరు రెండోవారంలో మరికొన్ని విద్యార్థి వీసా స్లాట్లను విడుదల చేయనున్నట్టు అమెరికా రాయబార కార్యాలయంలోని మినిస్టర్ కాన్సులర్ హెఫ్లిన్ ఇప్పటికే ప్రకటించారు.

హెచ్‌అండ్‌ఎల్‌ క్యాటగిరీ ఉద్యోగులు, వారి కుటుంబాల కోసం లక్ష వీసా స్లాట్లను విడుదల చేసినట్టు భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం వెల్లడించింది. దీనివల్ల 833 రోజులున్న వీసా నిరీక్షణ సమయం కూడా భారీగా తగ్గనుంది. వీసా కోసం ఇప్పటికే వేల మంది అపాయింట్‌మెంట్‌ బుక్‌ చేసుకోగా వనరులకు అనుగుణంగా హెచ్‌అండ్‌ఎల్‌ ఉద్యోగులకు వీసా అపాయింట్‌మెంట్లు ఇచ్చేందుకు ప్రాధాన్యం కొనసాగిస్తామని అధికారులు వెల్లడించారు.

- Advertisement -