మోడీకి లక్ష పోస్టు కార్డులు..

193
ramana
- Advertisement -

చేనేతపై కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీకి వ్యతిరేకంగా టీఆర్ఎస్ పోస్టు కార్డు ఉద్యమానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. మంత్రి కేటీఆర్ పిలుపుమేరకు రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది పోస్ట్ కార్డులను రాశారు నేతన్నలు.

ఈ పోస్ట్ కార్డులను ప్రధాని మోడీకి పంపడం కోసం ఆబిడ్స్ జనరల్ పోస్ట్ ఆఫీస్ లో డిపాజిట్ చేసేందుకు నిజాం కాలేజీ గ్రౌండ్స్ నుంచి జనరల్ పోస్ట్ ఆఫీస్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు నేతన్నలు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎల్ రమణ, హ్యాండ్లూమ్ మరియు పవర్లూమ్ కార్పొరేషన్ చైర్మన్ లు, తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎల్ రమణ మాట్లాడుతూ… కేంద్ర ప్రభుత్వం చేనేత కార్మికుల పట్ల అత్యంత క్రూరంగా వ్యవహరిస్తున్నదని, వారికి ఉన్న అన్ని సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేసి, వారిని చేనేత వృత్తి నుంచి దూరం చేస్తున్నదని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం చేనేతపైన ఉన్న ఐదు శాతం జీఎస్టీని పూర్తిగా ఎత్తివేయాలన్న ఏకైక నినాదంతో తెలంగాణ రాష్ట్రంలోని నేతన్నలు లక్షలాది పోస్ట్ కార్డులను ప్రధానమంత్రికి రాశారని, ఇప్పటికైనా దేశవ్యాప్తంగా ఉన్న నేతన్నల ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకొని కేంద్రం చేనేతపైన జిఎస్టిని పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

modi pm

ఇవి కూడా చదవండి..

తెలంగాణ‌లో మ‌రో భారీ పెట్టుబ‌డి

ఇప్పుడేమంటారు మోదీజీ?

తిమ్మాపూర్‌ను దత్తత తీసుకున్న నిర్మాత అభిషేక్

- Advertisement -