మ‌ళ్లీ కేసీఆర్ ప్ర‌భుత్వ‌మే: టైమ్స్ నౌ, సీఎన్ఎన్

251
kcr win
- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న సాధారణ ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ మళ్లీ విజయ దుంధుబి మోగించబోతోందని ఇప్పటికే పలు సర్వేలు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్‌ జరిగిన నేపథ్యంలో రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి రాబోతోందన్న విషయంపై పలు మీడియా సంస్థలు ఎగ్జిట్‌ పోల్స్‌ను రిలీజ్‌ చేశాయి. ఈ ఎగ్జిట్‌ పోల్స్ లో టీఆర్‌ఎస్‌ పార్టీయే తిరిగి మళ్లీ తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేపట్టనుందని స్పష్టంగా మనకు అర్ధమవుతోంది. సీఎన్ఎన్ వెల్లడించిన సర్వే ప్రకారం తెలంగాణలో తిరిగి అధికారం చేపట్టబోయేది టీఆర్ఎస్సే.

trs

మొత్తం 110 స్థానాలకు గాను టీఆర్ఎస్‌కు 50 నుంచి 65 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. ఇక ప్రజాకూటమికి 38 నుంచి 52 సీట్లు రానున్నట్టు పేర్కొంది. బీజేపీకి 4 నుంచి ఏడు స్థానాలు వస్తాయని, ఇతరులకు 8 నుంచి 14 స్థానాలు వస్తాయని పేర్కొంది. మరోవైపు ‘టైమ్స్ నౌ’ సర్వే కూడా టీఆర్ఎస్‌కు అనుకూలంగా సర్వే ఇచ్చింది. టీఆర్ఎస్‌కు 66 స్థానాలు వచ్చి అతిపెద్ద కూటమిగా అవతరిస్తుందని తేల్చింది.

kcr

మహాకూటమికి 37, బీజేపీకి 7, ఇతరులు 9 స్థానాల్లో గెలుపొందనున్నారని వెల్లడించింది. న్యూస్‌ 18 ఛానెల్‌ టీఆర్‌ఎస్‌కు 50-65, కూటమికి 38 నుంచి 52 స్థానాలు వస్తాయని, బీజేపీకి 4-7 సీట్లు వస్తాయని ఇతరులు 10- నుంచి 174 స్థానాల్లో గెలుస్తారని వెల్లడించింది. ఫలితాలు ఈ నెల 11 వ తేదీన వెల్లడికానున్న నేపథ్యంలో ఏ పార్టీ అధికారంలోకి రానుందని స్పస్టంగా తెలియనుంది.

- Advertisement -