నిఖిల్ ‘ముద్ర‌’ మ‌ళ్లీ వాయిదా…

247
mudra
- Advertisement -

యువ హీరో నిఖిల్ న‌టించిన ముద్ర సినిమా చాలా కాలం క్రిత‌మే విడుద‌ల కావాల్సి ఉంది. అయితే ప‌లు కార‌ణాల వ‌ల్ల ఈమూవీ విడుద‌ల ను వాయిదా వేసుకుంటూ వ‌చ్చారు. నిఖిల్ కు స‌రైన హిట్ లేక చాలా కాలం కావ‌డంతో ఈసినిమాపై భారీగా ఆశ‌లు పెట్టుకున్నాడు . అయితే ఈమూవీని ఈనెల 28న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు కొద్ది రోజుల క్రితం ప్ర‌క‌టించారు. తాజాగా ఉన్న స‌మాచారం ప్ర‌కారం ఈమూవీ మ‌రోసారి వాయిదా ప‌డ్డ‌ట్టు తెలుస్తుంది.

nikhil mudra

ఒకే మూవీ ఇన్ని సార్లు వాయిదా ప‌డ‌టంతో నిఖిల్ చాలా నిరాశ‌గా ఉన్నాడ‌ట‌. ఈసారి వాయిదాలు లేకుండా ప‌క్కాగా ఒక డేట్ ఫిక్స్ చేసి విడుద‌ల చేయాల‌ని చిత్ర‌యూనిట్ కు సూచించాడ‌ట నిఖిల్. త‌మిళ సినిమా క‌నిత‌న్ కు రిమేక్ గా ఈమూవీని తెర‌కెక్కిస్తున్నారు. ద‌ర్శ‌కుడు టీఎన్ సంతోష్ ఈమూవీని తెర‌కెక్కిస్తున్నారు. ఈమూవీలో నిఖిల్ ఇన్వేష్టిగేటివ్ జ‌ర్న‌లిస్ట్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. నిఖిల్ కు జోడిగా లావ‌ణ్య త్రిపాఠి హీరోయిన్ గా న‌టిస్తుంది. వెన్నెల కిషోర్, పోసాని కృష్ణ‌ముర‌ళి, నాగినీడు ప‌లువురు ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

- Advertisement -