అందం.. అనుకువ.. ధైర్యం.. తెగువ.. ఇవన్నీ కలగలిసి ఉన్న యువ కలెక్టర్.. అమ్రాపాలి. మోడ్రన్ డ్రెస్ వేసుకుని గుడిలోకి వచ్చి వార్తల్లో నిలిచిన ఆమ్రపాలి….వరంగల్ అర్బన్ అభివృద్ధి పథంలో నడపడంలో తనవంతు పాత్రను పోషిస్తూ అందరి మన్ననలు పొందుతోంది. ఓ వైపు అభివృద్ధిలో జిల్లాను పరుగులు పెట్టిస్తూనే మరోవైపు సాహసకార్యాలతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
తాజాగా ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ ఆధ్వర్యంలో దేవునూరు ఇనుప గుట్టల్లో జరిగిన ట్రెక్కింగ్ కార్యక్రమంలో ఆమ్రాపాలి పాల్గొంది. ఈ కార్యక్రమంలో వరంగల్ నిట్ విద్యార్థులతో పాటు, పలువురు అధికారులు, ఔత్సాహికులు పాల్గొన్నారు. ట్రెక్కింగ్ తనకు ఎంతో ఇష్టమని చెప్పిన అమ్రాపాలి ధర్మ సాగర్ గుట్టలు ట్రెక్కింగ్ కు ఎంతో అనువైనవని అన్నారు.
గతంలో కూడా మరో ఐఏఎస్ అధికారిణి ప్రీతి మీనాతో కలసి మహబూబ్ నగర్ జిల్లాలోని బయ్యారం చెరువు, పెద్ద గుట్టల్లో ఆమె పర్యటించారు. బయ్యారం అడవుల్లో కాలినడకను 12 కిలోమీటర్లపాటు తిరిగారు. దట్టమైన అటవీ ప్రాంతంలో ఆ ఇద్దరూ కలెక్టర్లు కాలినడనక ఆ ప్రాంతంలని ప్రకృతి అందాలను చూసి పరవశించిపోయారు. బయ్యారంలో ప్రభుత్వం ఏర్పాటుచేయాలనుకొన్న ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించిన ముడిసరుకును ఇచ్చే ఇనుపఖనిజం ఉన్న గుట్టను సందర్శించారు. జయశంకర్ జిల్లా రేగొండ మండలలోని పాండవుల గుట్టల్లో అటవీశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రాక్ క్లైంబింగ్ వేడుకల్లో భాగంగా పాండవుల గుట్టను అధిరోహించింది.