ఫిబ్రవరి 1, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 32వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 333 రోజులు (లీపు సంవత్సరములో 334 రోజులు) మిగిలినవి.
*సంఘటనలు*
1977: భారత తీర రక్షక దళం ఏర్పాటయింది.
1996: ఐ.ఎన్.ఎస్. వజ్ర బాహు భారతీయ నౌకాదళంలో చేరిన తేది (ఇది జలాంతర్గామి కాదు. ఒడ్డున ఉండే ముంబై లోని కార్యాలయం)
2003: అమెరికా స్పేస్ షటిల్ కొలంబియా, అంతరిక్షం నుండి భూమికి దిగి వచ్చేటపుడు కాలిపోయింది. ఈ దుర్ఘటనలో మరణించిన ఏడుగురిలో భారత సంతతికి చెందిన కల్పనా చావ్లా ఉంది.
1986: జనరల్ కె.సుందర్జీ భారత దేశమునకు సైనిక ప్రధానాధికారిగా నియామకం.
*జననాలు*
1929: జువ్వాడి గౌతమరావు, భాషాభిమాని, సాహితీకారుడు. (మ.2012)
1933: వెల్చేరు నారాయణరావు, ప్రముఖ తెలుగు సాహిత్య విమర్శకుడు, పరిశోధకుడు, అనువాదకుడు మరియు పండితుడు.
1936: కరణం బాలసుబ్రహ్మణ్యం పిళ్ళె, ప్రముఖ రచయిత, తెలుగు పండితులు. (మ.2016)
1945: బొజ్జి రాజారాం, కొంకణ్ రైల్వే మేనేజింగ్ డైరెక్టర్, వేలాడే రైలు స్కైబస్ రూపకర్తగా ప్రసిద్ధుడు.
1956: సుధాకర్, ప్రముఖ తెలుగు, తమిళ చలనచిత్ర నటుడు మరియు నిర్మాత.
1956: బ్రహ్మానందం, ప్రముఖ తెలుగు చలనచిత్ర హాస్యనటుడు.
1961: నాగసూరి వేణుగోపాల్, సైన్సు రచయిత, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్, హేతువాది.
1965: అంథోనీ పీటర్ కిశోర్, అధ్యాపకులు, బైబులు ఉపదేశకులు, సమాజసేవకులు.
1971: అజయ్ జడేజా, భారత క్రికెట్ క్రీడాకారుడు.
*మరణాలు*
2003: కల్పనా చావ్లా, ఇండియన్ -అమెరికన్ వ్యోమగామి మరియు వ్యొమనౌక యంత్ర నిపుణురాలు. (జ.1962)
2009: రణబీర్ సింగ్ హుడా, భారత రాజ్యాంగ నిర్మాణసభ సభ్యుడు.
*పండుగలు మరియు జాతీయ దినాలు*
?భారతీయ తపాలా బీమా దినం.
?భారత తీర రక్షక దళ దినోత్సవం