సీఎం కేసీఆర్ బర్త్ డే రోజు ఆపని చేయండిః కేటీఆర్

330
ktr Hugs Kcr
- Advertisement -

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఈనెల 17వ తేదితో 64వసంతాలు పూర్తీ చేసుకొనున్నారు. ఈసందర్భంగా పలువురు నేతలు సీఎం కేసీఆర్ బర్త్ డే వేడుకలను గ్రాండ్ గా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం కేసీఆర్ పుట్టిన రోజుకు ఇంకా మూడు రోజులు మాత్రమే సమయం ఉండటంతో ఇప్పటినుంచి ఏర్పాట్లు చేస్తున్నారు. మరికొంత మంది కార్యకర్తలు, నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకుంటారు. సీఎం బర్త్ డే సందర్భంగా ఎటువంటి అనవసర ఖర్చు పెట్టవద్దని టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, కేసీఆర్ అభిమానులకు సూచించారు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.

కార్యకర్తలు, ఫ్లెక్సీలు, ప్రకటనలు, పార్టీలతో డబ్బులను వృధా చేయోద్దని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్త ఆ రోజున ఒక మొక్కను నాటి సీఎం కేసీఆర్ పై తమకున్న అభిమానాన్ని చాటుకోవాలని ట్వీట్ చేశారు కేటీఆర్. పుట్టిన రోజుల పేరిట అనవసరంగా ఖర్చు పెట్టడం కేటీఆర్ కు అస్సలు ఇష్టం ఉండదు. తన పుట్టిన రోజున కూడా డబ్బులు వృధా చేయవద్దని అభిమానులు, కార్యకర్తలకు చెప్పిన సంగతి తెలిసిందే. ప్లెక్సీలు, ప్రకటనలకు పెట్టే ఖర్చు పేద వారికి సహాయం చేయండి అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.

- Advertisement -