రవితేజ హీరోగా నటించిన రామారావు ఆన్ డ్యూటీ మూవీ ఎట్టకేలకు ప్రపంచవ్యాప్తంగా జూలై 29 వ తేదీన విడుదలైంది. అయితే ఈ సినిమా ఊహించిన మేర అంచనాలను అందుకోవడంలో విఫలమైందని అంటున్నారు. రవితేజ ఎమ్మార్వోగా అలాగే డిప్యూటీ కలెక్టర్గా కనిపించిన ఈ సినిమా ఒక మిస్టరీ, ఒక థ్రిల్లర్ అని ముందు నుంచి ప్రచారం చేశారు. కానీ ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయిందనే వాదనలు వినిపిస్తున్నాయి.
అయితే ఈ సినిమా విషయంలో మాత్రం ఒక అంశం హాట్ టాపిక్ గా మారింది. అదేమిటంటే ఈ సినిమాలో పవిత్ర లోకేష్ రవితేజ తల్లి పాత్రలో కనిపించారు. అయితే నరేష్ మాత్రం హీరోయిన్ తండ్రి పాత్రలో కనిపించారు. అంటే ఒకరకంగా వీరిద్దరూ కూడా అన్నాచెల్లెళ్ల పాత్రలలో కనిపించారు, వీరిద్దరూ కలిసి కనిపించింది ఒకటి రెండు సన్నివేశాలలోనే ఆయినా వీరిద్దరూ కలిసి కనిపించిన సన్నివేశాలకు ప్రేక్షకుల నుంచి విపరీతమైన రెస్పాన్స్ లభించిందని చెబుతున్నారు.
ఈ సినిమాలో రవితేజ కనిపించినప్పుడు కంటే పవిత్ర లోకేష్ స్క్రీన్ మీద ఎప్పుడు కనిపించినా ప్రేక్షకులు, అభిమానులు కేరింతలు కొట్టారంటూ ప్రచారం జరుగుతోంది. నిజానికి పవిత్ర లోకేష్ తన భర్త నుంచి విడిపోయి వేరేగా ఉంటున్నారని అలాగే నరేష్ కూడా ఒంటరిగా జీవిస్తున్న నేపథ్యంలో వీరిద్దరి మధ్య సంబంధ బాంధవ్యాలు బలపడి ఇద్దరూ కూడా లివింగ్ రిలేషన్ లో ఉన్నారని గతంలో పెద్ద ఎత్తున ప్రచారాలు జరిగాయి. అయితే ఇదంతా నిజమే సినీ ఇండస్ట్రీలో సినిమా అవకాశాలు రావు కాని పెద్ద హీరోల మధ్య నటిస్తున్నారంటే అదంతా పుకార్లే అని సినీ వర్గాలు కోడై కూస్తున్నాయి…!