యువీ పెళ్లిపై.. గంభీర్‌ పంచ్‌ !

170
On Gautam Gambhir's birthday, Yuvraj Singh starts fire only to get trolled on wedding
- Advertisement -

ఈ ఇద్దరూ మాజీ సహచరులు భారత జట్టు విజయాల్లో పాలు పంచుకున్నారు. టీమిండియాకు దూరమై.. ప్రస్తుతం జట్టులో చోటు కోసం తపిస్తున్న ఆ ఇద్దరే ఆల్‌రౌండర్‌ యువరాజ్‌సింగ్‌, వెటరన్‌ ఓపెనర్‌ గౌతమ్‌ గంభీర్‌లు. శుక్రవారం వీరిద్దరూ ఒకరిపై ఒకరు పంచ్‌లేసుకున్నారు.

నిన్న(శుక్రవారం) 35వ పుట్టినరోజు జరుపుకుంటున్న గంభీర్‌కి పలువురు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సంధర్బంగా యువరాజ్ సింగ్ కూడా గంభీర్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశాడు. ‘పుట్టిన రోజు శుభాకాంక్షలు మిస్టర్‌ గౌతమ్‌ గంభీర్‌! నవ్వు ముఖంతో నువ్వు వికెట్ల మధ్యన పరుగుతీసేలా దేవుడు నిన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నా’ అని యువీ ట్వీట్‌ చేశాడు.

Gambir yuvi

దీనికి గౌతీ అనూహ్య పంచ్‌ వేశాడు. ‘శుభాకాంక్షలు చెప్పిన యువీ సోదరుడికి కృతజ్ఞతలు. త్వరలోనే మీకు పెళ్లికాగానే మీ ఇద్దరూ పడక గది.. వంట గది మధ్యన వేగంగా పరుగెత్తుతారని అనుకుంటున్నా!’ అని చమత్కరించాడు. బాలీవుడ్‌ నటి, మోడల్‌ హేజెల్‌ కీచ్‌తో యువరాజ్‌కు నిశ్చితార్థమైన సంగతి తెలిసిందే. నవంబర్‌ 30న వారిద్దరూ పెళ్లి పీటలెక్కనున్నారు. దాదాపు రెండేళ్ల తరువాత టీమ్‌లోకి వచ్చిన టీమిండియా ఒపెనర్ గౌతమ్ గంబీర్.. గాయమైనప్పటికీ హాఫ్ సెంచరీ చేసి తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు.

- Advertisement -