సామ్ గురించి నాగార్జునకి తెలియదు…..

334
Omkar
- Advertisement -

ఓంకార్ దర్శకత్వంలో రూపొందిన ‘రాజుగారి గది 2’ విడుదలకి ముస్తాబవుతోంది. పీవీపీ సినిమా, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో సమంత, సీరత్ కపూర్, వెన్నెలకిషోర్, అశ్విన్ కీలకపాత్రలు పోషిస్తున్న ఈ మూవీ ఈ నెల 13వ తేదీన ఈ సినిమా భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తాజాగా సెన్సార్‌ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా, యు/ఎ సర్టిఫికేట్ ను సంపాదించుకుంది. నాగార్జున మొదటిసారిగా నటించిన హారర్ థ్రిల్లర్ మూవీ ఇది. వచ్చే శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతున్న ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా దర్శకుడు ఓంకార్‌ ఇవాళ మీడియా సమావేశం నిర్వహించారు.

samantha

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజుగారి గది 2 సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుందని అన్నారు. నాగార్జున, సమంతలు ప్రముఖ పాత్రధారులుగా తెరకెక్కిన ఈ సినిమా పీవీపీ సంస్థకు మంచి పేరుతీసుకొస్తుందని అన్నారు.  ఈ కథ రాసుకున్న తర్వాత ముందుగా నాగార్జున తమ ప్రాజెక్ట్ లోకి వచ్చారని, ఓ నెల రోజుల తర్వాత సమంత వచ్చిందని చెప్పారు. ఈ సినిమాలో నాగార్జున నటిస్తున్నట్టు సమంతకు తెలుసు గానీ, సమంత నటిస్తున్నట్టు నాగార్జునకు ముందుగా తెలియదని, ఆ తర్వాత తెలిసిందని చెప్పారు. ‘రాజు గారి గది’ చిత్రంలోలానే ‘రాజు గారి గది 2’లో కూడా మెస్సేజ్ ఉంటుందని, మన చుట్టూ ఉన్న స్త్రీలను గౌరవించాలనేదే ఈ మెస్సేజ్ అని చెప్పుకొచ్చారు.

rajugarigadhi-

‘రాజు గారి గది 2’లో ఆత్మ క్యారెక్టర్ లో సమంత నటన అద్భుతమని, ఆమె కెరీర్ లోనే మంచి చిత్రంగా నిలిచిపోతుందని అభిప్రాయపడ్డారు. ఈ చిత్రం క్లైమాక్స్ లో నాగార్జున, సమంత నటన అందరినీ ఆకట్టుకుంటుందని, బాలీవుడ్ ధూమ్ సిరీస్ ఏ విధంగా విజయవంతమైందో, ‘రాజుగారి గది’ సిరీస్ కూడా సక్సెస్ అవుతుందని ధీమాగా చెప్పారు. ఈ సిరీస్ లో రాజుగారి గది 3, 4 కూడా ఉంటాయని అన్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినమాలో ప్రవీణ్, షకలక శంకర్, నరేష్ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

- Advertisement -