నాగ్..’ఓం నమో వేంకటేశాయ’ టీజర్

360
Om Namo Venkatesaya Teaser
- Advertisement -

కింగ్ నాగార్జున.. భక్తిరస చిత్రం ఓం నమో వేంకటేశాయ టీజర్ విడుదలైంది.ప్రస్తుతం షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా తొలి డైలాగ్ టీజర్ ను రిలీజ్ చేసింది చిత్రయూనిట్.

ఈ చిత్రంలో నాగ్ హథీరాం బాబా పాత్రలో కనిపించనుండగా, అనుష్క కృష్ణమ్మగా కనిపించనుంది. శ్రీనివాసుడి పాత్రను సారభ్ జైన్ పోషిస్తోండగా… ప్రగ్యా జైస్వాల్ కీలక పాత్రలో మెరవనుంది. జగపతి బాబు ఈ చిత్రంలో విలన్ గా నటించనున్నాడనే టాక్ కూడా నడుస్తోంది. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో భారవి కథా కథనాలు అందిస్తూ తెరకెక్కిస్తున్న ఈ సినిమా…. ఫిబ్రవరి రెండో వారంలో రిలీజ్ కు రెడీ అవుతోంది.

సినిమాలోని పాత్రదారులందరినీ పరిచయం చేస్తూ రిలీజ్ చేసిన ఈ టీజర్లో నాగ్ను భక్తుడిగానే కాక.. ధర్మం కోసం ఎవరినైనా ఎదిరించే వ్యక్తిగా చూపించారు. తొలిసారిగా తెలుగు తెర మీద కనిపించిన సౌరభ్ జైన్ వేంకటేశ్వరుని పాత్రలో ఆకట్టుకున్నాడు. దర్శకేంద్రుడి మార్క్ విజువల్స్తో తెరకెక్కిన ఓం నమో వేంకటేశాయ నాగార్జున కెరీర్లో మరో మైల్ స్టోన్గా నిలుస్తుందని అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -