నా జీవితం చాలా బోరింగ్ గా ఉంటుంది- నాగ్‌

248
Om Namo Venkatesaya Success Meet
- Advertisement -

‘ఓం నమో వెంకటేశాయ’తో హిట్ కొట్టి నాగ్‌ ఇప్పుడు చాలా ఆనందంగా ఉన్నాడు. ఈ ఆనందానికి మరో ఆనందం తోడైనట్లైంది కింగ్‌ నాగార్జునాకి. ‘ఓం నమో వెంకటేశాయ’ సినిమా చూసిన వారిలో కొంతమంది నాగ్ నటన చూసి అక్కినేని నాగేశ్వరరావుని గుర్తుతెచ్చుకున్నారట. ఆ విషయాన్ని స్వయంగా నాగార్జున తెలిపారు. ‘ఓం నమో వెంకటేశాయ’ సినిమాలో నాగార్జున నటన చూసిన వారికి తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు గుర్తుకొచ్చారు అనగానే తనకు చాలా ఆనందాన్నిచ్చిందని  నాగ్ అన్నాడు.

మరోవైపు ఇక్కడ నాగ్ చమత్కారపు మాట కూడా వదిలాడు. ‘‘నాకు వయసైపోతోంది కదా.. అందుకే నాన్నగారి లాగే కనిపించానేమో. పతాక సన్నివేశాల్లో నన్ను  చూస్తుంటే నాన్నగారిని చూస్తున్నట్లే కనిపించింది అని కొందరు చెప్పడంతో  ఆ మాటలు నాకెంతో సంతోషాన్నిచ్చాయి’’ అని ‘ఓం నమో వేంకటేశాయ’ సక్సెస్ మీట్ లో నాగ్ అన్నాడు.
   Om Namo Venkatesaya Success Meet
భవిష్యత్తులో మీపై  ఓ బయోపిక్ తీస్తారని అనుకుంటున్నారా అని నాగ్‌ను అడిగితే.. ‘‘అవసరం లేదు. నా జీవితం చాలా బోరింగ్ గా ఉంటుంది. అంటే నా బయోపిక్ కూడా బోరింగ్‌గానే ఉంటుందన్నమాట’’ అని చెప్పాడు. ఇదే క్రమంలో ‘సోగ్గాడే చిన్నినాయనా’కు సీక్వెల్ అయిన ‘బంగార్రాజు’ చేయాలని చాలా ఉత్సాహంగా ఉన్నానని అన్నారు నాగార్జున.  ఈ ఏడాది చివరి లోపు ఆ సినిమా సెట్స్ మీదికి వెళ్తుందని కూడా వెల్లడించాడు.

ఇక ‘మనం’ సినిమాకు సీక్వెల్ అంటూ ఈ మధ్య వచ్చిన రూమర్ల చక్కర్లు కొట్ట్టాయి. దీని గురించి నాగ్ స్పందిస్తూ.. “అందుకు అవకాశమే లేదు. మేం ఆ సినిమాను ముట్టుకోం. మా కుటుంబానికి ఆ సినిమాతో చాలా సెంటిమెంట్లు ముడిపడి ఉన్నాయి. ఏఎన్నార్ అలాగే నిలిచి ఉంటారు. మనం సినిమా కూడా ఇప్పుడున్న తరహాలోనే మా హృదయాల్లో నిలిచి ఉంటుంది” అని నాగ్ తన మనసులోని మాటను తెలిపాడు.

- Advertisement -