లోక్ సభ స్పీకర్‌గా ఓం బిర్లా!

23
- Advertisement -

18వ లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా రెండోసారి ఎన్నికయ్యే అవకాశం ఉంది. తొలి రోజు 262 మంది ఎంపీల ప్రమాణస్వీకార కార్యక్రమం జరుగగా రెండోరోజు ఎంపీల ప్రమాణస్వీకార కార్యక్రమం కొనసాగుతోంది. ఇక లోక్ సభ స్పీకర్‌గా రెండోసారి బాధ్యతలు చేపట్టబోతున్నారు ఓం బిర్లా.

ఎన్డీయే నేతలతో కలిసి స్పీకర్ పదవి కోసం ఓం బిర్లా నామినేషన్ దాఖలు చేయనున్నారు. విపక్షాలకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వవచ్చని తెలుస్తోంది. ఇండియా కూటమి నేతలతో కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ చర్చలు జరిపారు. డిప్యూటీ స్పీకర్ పదవి విపక్షాలకు ఇస్తే ఏకగ్రీవం అయ్యేందుకు సహకరిస్తామని ఇండియా కూటమి నేతలు చెప్పగా దీనికి రాజ్‌నాథ్‌ ఒప్పుకున్నట్లు సమాచారం.

Also Read:ఆసీస్ ఔట్…సెమీస్‌లో ఆఫ్ఘానిస్తాన్

- Advertisement -