Olympics 2024 Rewind: ఆరు పతకాలతో భారత్..మరో ఏడు మిస్!

4
- Advertisement -

పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్‌లో భారత్ ఎన్నో ఆశలతో బరిలోకి దిగింది. అయితే విశ్వక్రీడా వేదికపై మాత్రం నిరుత్సాహ పర్చిందనే చెప్పాలి. 2020 టోక్యోలో జరిగిన ఒలింపిక్స్‌తో పోలిస్తే ఈసారి ఓ పతకం తగ్గింది. కేవలం ఆరు పతకాలను మాత్రమే సాధించారు భారత ఆటగాళ్లు. వినేశ్ పోగట్ ఎపిసోడ్‌, మరో అరడజనుకు పైగా పతకాలు తృటిలో చేజారాయి. అయితే ఈ సారి ఒక్క స్వర్ణ పతకం సాధించకుండానే భారత్ వెనుదిరిగింది. సాధించిన ఆరు పతకాల్లో ఒకటి రజతం,మిగతా ఐదు కాంస్యాలు.

పతకాల పట్టికలో వెనుక పడినా ఆటగాళ్లు మాత్రం అద్భుతంగా రాణించారు. ఏడు ఈవెంట్‌లలో భారత అథ్లెట్లు నాలుగో స్థానంలో నిలిచి పతకం సాధించే అవకాశాన్ని తృటిలో కొల్పోగా టోక్యో ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన పీవీ సింధు, మీరాబాయి చాను, లవ్లీనా బోర్గెహెయిన్ ఈ సారి నిరాశపర్చారు. అలాగే లక్ష్యసేన్, బాక్సర్ నిఖత్ జరీన్‌లు ఆశీంచిన మేరకు రాణించలేకపోయారు.

ఇక భారత్ సాధించిన ఆరు పతకాల్లో మూడు షూటింగ్‌లో వచ్చినవే. మను భాకర్ రెండు కాంస్యాలను సాధించింది. ఆర్చరీలో ధీరజ్-అంకిత, షూటింగ్‌లో అనంత్ జీత్- మహేశ్వరీ, బాక్సింగ్‌లో నిశాంత్ దేవ్, లవ్లీనా బోర్గెహెయిన్, బ్యాడ్మింటన్‌లో లక్ష్యసేన్, సాత్విక్-చిరాగ్‌లు స్వల్ప తేడాలో పతకాన్ని మిస్ చేసుకున్నారు.

గత ఒలింపిక్స్‌లో పసిడి గెలిచిన నీరజ్ చోప్రా.. ఈసారి రజత పతకానని సొంతం చేసుకున్నాడు. తన కెరీర్ బెస్ట్ త్రోను విసిరినా.. పాకిస్థాన్‌కు చెందిన అర్షద్ నదీమ్ అంతకంటే బాగా విసరడంతో నీరజ్ రెండో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. రెజ్లర్ వినేష్ ఫొగాట్ సైతం ఫైనల్ చేరి పతకం ఖాయం చేసింది. కానీ నిర్ణీత బరువు కంటే 100 గ్రాముల అదనంగా ఉండటంతో ఆమెపై అనర్హత వేటు పడింది.

ఓవరాల్‌గా మను భాకర్ – 10 మీ. ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో కాంస్యం, మను భాకర్, సరబ్జోత్ సింగ్ – 10 మీ. ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో కాంస్యం, స్వప్నిల్ కుశాలే – 50 మీటర్ల రైఫిల్ ఈవెంట్‌లో కాంస్యం, నీరజ్ చోప్రా – జావెలిన్ త్రోలో రజతం సాధించారు. అమన్ షెరావత్ – రెజ్లింగ్‌లో కాంస్యం, హాకీలో భారత్‌కు కాంస్య పతకం దక్కింది.

Also Read:T20 World Cup Roundup: 17 ఏళ్ల నిరీక్షణకు తెరదించిన రోహిత్ సేన

- Advertisement -