వైసీపీ అధినేత జగన్ స్టైలే వేరు. తండ్రి రాజశేఖర్ రెడ్డి బాటలో నడిచే జగన్ సేమ్ ఆయన మాట,ఆయ స్టైల్‌ను అనుకరించే ప్రయత్నం చేస్తుంటాడు. సాధారణంగా రాజకీయాల్లో ఉన్న వారు ఒక్క అడుగు ముందుకు వేయాలంటే వంద సార్లు ఆలోచిస్తారు. మాట ఇచ్చేముందు కూడా వెయ్యిసార్లు ఆలోచిస్తారు. ఎందుకంటే గతంలో ఎంతోమంది నాయకులు నోరుజారి అబాసుపాలైన వారై. ఇక మహిళల విషయంలో తొంగి చూడాలంటేనే భయపడతారు. కానీ ఇలాంటి వాటికి వైఎస్ ఫ్యామిలీ భిన్నం. ఫ్లైయింగ్ కిస్‌లు ఇచ్చిన ఓదార్పు పేరు మహిళల నుదుటి మీద ముద్దులిచ్చిన వారికే చెల్లింది.
ఇక వైఎస్ మరణానంతరం జగన్ అనుకరించిన స్టైల్ రాజకీయాల్లో పెద్ద చర్చే నడిచింది. సామాన్య ప్రజానికానికి చేరువ కావాలనే తలంపుతో తన దగ్గరకు వచ్చిన వారిని ఆప్యాయంగా అక్కరకు చేర్చుకుని నుదటిపై ముద్దాడే విధానంతో పలుమార్లు విమర్శల పాలయ్యాడు జగన్. సాధారణంగా కరచాలనం, చేతులను తాకడం వంటివి చేస్తుంటారు కానీ ఇలా ముద్దాడే సందర్భాలు లేకపోవటంతో జగన్ మార్క్ రాజకీయంగా సదరు సన్నివేశాలు ఆవిర్భవించాయి.
కానీ ఇప్పుడు ఇదే జగన్‌కు షాకిచ్చింది. ఇటీవల ఓ యాత్రలో జగన్ సాధారణంగా నుదుటిపై ముద్దు పెట్టేందుకు ప్రయత్నించగా ఓ బామ్మ అవాక్కయ్యే విధంగా జగన్‌నే దగ్గరికి తీసుకుని పెదాలపై ముద్దాడేసింది. పక్కన ఉన్న బాడీ గార్డులు ఆ అమ్మను లాగేయాలని ప్రయత్నించినప్పటికీ ఉడుం పట్టుతో జగన్‌ను దగ్గరకు తీసుకోవడం గమనార్హం.
ఇప్పుడు ఇదే ఫోటో సోషల్ మీడియాలో వైరలైంది. ఎవరికీ తోచిన విధంగా వారు ఈ ఫోటోపై కామెంట్స్ పోస్టు చేస్తు ఫోటోను షేర్ చేస్తున్నారు. కొంతమంది ఇకపై జగన్ యాత్ర స్టైల్ మార్చాలేమో అంటూ కామెంట్లు పోస్టు చేస్తుండగా మరికొందరు నెగటివ్ కామెంట్లను చేస్తున్నారు. మొత్తంగా ఒక్క ముద్దుతో ఈ బామ్మ టాక్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్‌గా మారిపోయింది.