రాకింగ్ స్టార్ మంచు మనోజ్ ఎల్.టి.టి.ఈ మిలిటెంట్ చీఫ్ ప్రభాకరన్ గా, బాధ్యతగల యువ విద్యార్ధిగా ద్విపాత్రాభినయం చేస్తున్న చిత్రం “ఒక్కడు మిగిలాడు”. అజయ్ ఆండ్రూస్ నూతక్కి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పద్మజ ఫిలిమ్స్-న్యూ ఎంపైర్ సెల్యులాయిడ్స్ పతాకాలపై ఎస్.ఎన్.రెడ్డి-లక్ష్మీకాంత్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఫస్ట్‌లుక్‌తోనే సినిమాపై అంచనాలను పెంచేసిన మనోజ్ తాజాగా టీజర్‌తో మరింతగా ఆకట్టుకున్నాడు.
చిందిస్తా నా ప్రాణాన్ని…. చిందిస్తా నా రక్తాన్ని….. నీ దొసిల్లలో పోస్తా….. ఏరులై పారిస్తా నా తండ్రి….. తలెత్తి తిరగాలిరా….. రొమ్ము విడిచి నడవాలిరా నా తండ్రి….. వీరులు ఏడవకూడదు వీరులు ఏడవకూడదు నాన్న….. దేశం వర్ధిల్లాలి అంటూ మనోజ్ చెప్పిన డైలాగ్ అందరిని ఆకట్టుకుంటోంది.
టీజర్ లోనే ఇన్ని చలించి పోయే డైలాగ్స్ ఉంటే సినిమా లో ఇంకా ఎన్ని ఉంటాయో అన్నట్టుగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ లో మంచు మనోజ్ ఎల్టీటీఈ చీఫ్ ప్రభాకరన్ పాత్రలో నటిస్తున్నాడు. తెలుగు, తమిళ్, కన్నడంలో ఈ మూవీ రిలీజ్ కానుంది.