ఇండస్ట్రీని షేక్ చేసిన పాత్రలను ఎంతోమంది నటులు చేసిన…రోలెక్స్ పాత్ర మాత్రం ఇండస్ట్రీని షేక్ చేసిన విధానం వేరు. కోలీవుడ్‌లో విక్రమ్ సినిమాలో సూర్య చేసిన పాత్ర రోలెక్స్ ఈ సినిమాకే హైలెట్‌గా నిలిచింది. అయితే తాజాగా చెన్నైలో జరిగిన ఓ అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్న కమల్‌హాసన్…ఓ విభాగంలో సూర్యకు అవార్డు అందించారు.
ఈ సందర్భంగా కమల్ మాట్లాడుతూ…రోలెక్స్ పాత్ర విక్రమ్ సినిమాకు ఎంతో మందిని చేరువయ్యేలా చేసింది. ఈ పాత్ర చేయడానికి అంగీకరించినందుకు సూర్యకు మరోసారి ధన్యవాదాలు. మేము చివరి నిమిషంలో తీసుకున్న నిర్ణయం. ఒక్క ఫోన్‌కాల్ చేసిన వెంటనే సూర్య ఈ పాత్ర చేయడానికి ఓకే అన్నారు అంటూ సూర్యని హత్తుకుని ఆయన నుదిటిపై కమల్ ముద్దు పెట్టుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఒకే స్టేజీపై విక్రమ్ రోలెక్స్ ఉండటం ఆనందంగా ఉందంటూ నెటిజన్లు అంటున్నారు.
దర్శకుడు లోకేశ్ మాట్లాడుతూ…త్వరలోనే సూర్యతో ఓ సినిమా చేస్తున్నానని తెలిపారు. సూర్యతో ప్రాజెక్ట్ చేయాలని ఆసక్తిగా ఉంది. ఒకవేళ అన్ని కుదిరితే ఐదు నెల్లో పూర్తి చేస్తా అని అన్నారు. అయితే ప్రస్తుతం లోకేశ్ లియో సినిమా బిజీలో ఉన్న విషయం తెలిసిందే.
Adorable Moment
Agent Vikram inviting #Rolex on the stage
#KamalHaasan – #Suriya pic.twitter.com/atRrBGpiDQ
— RAMUNAIDU VIJAYAWADA SFC
(@RamuNaiduEdit) April 1, 2023
ఇవి కూడా చదవండి…