ఓజీ ఓటీటీలో ట్రెండ్ సెట్టర్!

7
- Advertisement -

ఓటీటీలో ఓజీ ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. గత వారం OG, పరమ్ సుందరి, వాష్ లెవల్ 2, శక్తి తిరుమగన్ వంటి సినిమాలు OTTలో విడుదలయ్యాయి. అయితే పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన OG అన్ని సినిమాలను అధిగమించి OTTలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది.

సుజీత్ దర్శకత్వం వహించిన ఈ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆర్మాక్స్ నివేదిక ప్రకారం, అక్టోబర్ 20 నుండి అక్టోబర్ 26 వరకు OG దేశవ్యాప్తంగా OTTలో అత్యధికంగా వీక్షించబడిన చిత్రం కాగా, 3.5 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది.

గ్రేటర్ కలేష్, పరమ్ సుందరి, శక్తి తిరుమగన్, వార్ 2 సినిమాలను ఓజీ అధిగమించింది.ఈ చిత్రంలో ప్రియాంక మోహన్ కథానాయికగా నటించగా, ఎమ్రాన్ హష్మీ, శ్రీయా రెడ్డి, ప్రకాష్ రాజ్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు.

Also Read:రామ్ పోతినేని..సాంగ్ అప్‌డేట్

- Advertisement -