పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం OG (They Call Him OG). సెప్టెంబర్ 25న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలకు సిద్ధమవుతోంది. గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్‌తోనే ప్రేక్షకుల్లో భారీ అంచనాలను రేకెత్తించింది. ఇప్పటివరకు విడుదలైన ప్రతి ఆసెట్ అభిమానులను థ్రిల్‌కి గురి చేస్తుండగా, అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నది థియేట్రికల్ ట్రైలర్.
ఇందుకు సంబంధించిన ప్రత్యేక పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. సెప్టెంబర్ 21న ఉదయం 10:08 గంటలకు విడుదల కానుంది. దర్శకుడు సుజీత్ ఈ ట్రైలర్ అప్‌డేట్‌ను పవర్‌స్టార్ లుక్‌తో కూడిన అద్భుత పోస్టర్ ద్వారా ప్రకటించారు. అదే రోజున ప్రీ-రిలీజ్ ఈవెంట్ కూడా జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
DVV ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాణంలో DVV దానయ్య, కల్యాణ్ దాసరి ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇమ్రాన్ హష్మి విలన్‌గా నటిస్తుండగా, పవన్ సరసన ప్రియాంకా మోహన్ హీరోయిన్‌గా కనిపించనుంది. అలాగే శ్రియా రెడ్డి, ప్రకాశ్ రాజ్, అర్జున్ దాస్, హరీస్ ఉత్తమన్, అజయ్ ఘోష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
Also Read:దత్తత తీసుకున్న మంచు లక్ష్మీ!

