50 శాతం పూర్తి చేసుకున్న ‘OG’

41
- Advertisement -

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తోన్న OG సినిమాను యంగ్ డైరెక్టర్ సుజిత్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ముంబై గ్యాంగ్‌స్టర్ బ్యాక్‌ డ్రాప్‌ లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం యాభై శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ విష‌యాన్ని మేకర్స్ ప్రకటిస్తూ సినిమా యూనిట్ ఫొటోను ట్విట్టర్‌లో షేర్ చేసింది. నేటితో ఈ సినిమా మూడో షెడ్యూల్ పూర్తయిన‌ట్లు తెలిపింది. నాని గ్యాంగ్ లీడర్‌ తో టాలీవుడ్‌లోకి అరంగేట్రం చేసిన ప్రియాంక అరుల్ మోహన్ ఈ పవర్‌ ఫుల్ మూవీలో కథానాయికగా నటిస్తోంది. ఇక వచ్చే షెడ్యూల్ లో హీరో హీరోయిన్ల పై ప్రేమ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని తెలుస్తోంది.

Also Read: స్పైలో ఛాలెంజింగ్ రోల్..ఐశ్వర్య

యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని DVV దానయ్య నిర్మిస్తుండగా.. అనిరుధ్ స్వరాలు సమకూరుస్తున్నారు. పైగా పవర్ స్టార్ సినీ కెరీర్ లోనే మోస్ట్ వైల్డ్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ చిత్రం రాబోతుంది. అయితే, ఈ సినిమా షెడ్యూల్స్ విషయంలో ఓ సమస్య ఉంది. సుజిత్ రాసుకున్న యాక్షన్ థ్రిల్లర్ కి పవన్ కళ్యాణ్ ఎక్కువ డేట్స్ కేటాయించాల్సి ఉంది. కానీ, ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఒక సినిమా కోసమే ఎక్కువ డేట్స్ కేటాయించే పరిస్థితి లేదు. హరిహర వీరమల్లు సినిమా అందుకే లేటు అవుతూ వస్తోంది. ఇప్పుడు సుజిత్ సినిమాకి కూడా అదే గతి పడుతుంది అని అంటున్నారు. మరి ఏం అవుతుందో చూడాలి.

Also Read: కింగ్ ఆఫ్ కోథాలో ఎడ్జీగా దుల్కర్‌

- Advertisement -