OG…ఫస్ట్ సింగిల్!

6
- Advertisement -

సుజీత్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ఓజీ. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తుండగా డివివి ఎంటర్‌టైన్మెంట్స్‌ నిర్మిస్తోంది. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో శ్రీయా రెడ్డి, అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్, షామ్, హరీష్ ఉత్తమన్ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.

దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన ఈ హై ఎండ్ యాక్షన్ చిత్రం నుంచి ఎప్పుడు నుంచో ఎదురు చూస్తున్న మొదటి పాట ఈ సాయంత్రం వస్తుండగా ఎలాంటి ప్రోమో లాంటిది లేకుండానే భారీ హైప్ ఈ సాంగ్ సెట్ చేసుకుంది.

ఇక ప్రోమో రాలేదు కానీ సాంగ్ రన్ టైం మాత్రం ఇప్పుడు వచ్చేసింది. ఈ సాంగ్ సరిగ్గా అంటే సరిగ్గా 4 నిమిషాల నిడివితో మేకర్స్ కట్ చేశారు. ఈ అవైటెడ్ సినిమా సెప్టెంబర్ 25న గ్రాండ్ గా విడుదలకి రాబోతుంది.

Also Read:RSP:బ్యూరోకాట్సా..అధికార పార్టీ ప్రతినిధులా?

- Advertisement -