పవన్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఓజీ మూవీ నిన్న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకువచ్చిన సంగతి తెలిసిందే. తొలిరోజు ఓజీ భారీ వసూళ్లను రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్ల గ్రాండ్ కలెక్షన్స్ సాధించింది.
ఇండియా వైడ్ షోస్ ద్వారా ₹65 కోట్లు, ఓవర్సీస్ ప్రీమియర్స్ ద్వారా ₹27 కోట్లు (3.65 మిలియన్ డాలర్లు) రాబట్టినట్లు సమాచారం. ఆంధ్ర ప్రదేశ్: ₹30.80 కోట్లు, తెలంగాణ: ₹26 కోట్లు, కర్ణాటక: ₹6.37 కోట్లు, తమిళనాడు: ₹1.20 కోట్లు, ఓవర్సీస్ (ప్రధానంగా నార్త్ అమెరికా): ₹24.85 కోట్లు, ఇతర దేశాలు: ₹7.55 కోట్లు వసూలు చేసినట్టు సమాచారం.
బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ విలన్‌గా నటించగా, హీరోయిన్‌గా ప్రియాంక అరుల్ మోహన్ మెరిశారు. అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్, శుభలేఖ సుధాకర్, హరీష్ ఉత్తమన్ తదితరులు ముఖ్యపాత్రల్లో నటించారు.రవి కె చంద్రన్ సినిమాటోగ్రఫీ అందించగా, ఎస్‌ఎస్ థమన్ మ్యూజిక్ అందించారు. ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య ₹250 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించారు.
Also Read:BB9:హౌస్‌లోకి కొత్త కంటెస్టెంట్

