సుజీత్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ఓజీ. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తుండగా డివివి ఎంటర్‌టైన్మెంట్స్ నిర్మిస్తోంది. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్రలో నటిస్తున్నాడు.
ఈ సినిమాపై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ నెలకొంది. పవన్ కళ్యాణ్ తిరిగి సెట్స్‌కి చేరడంతో షూటింగ్ మళ్లీ ఊపందుకుంది. తాజా సమాచారం ప్రకారం…పవన్ కళ్యాణ్ మరియు ప్రతినాయకుడు ఇమ్రాన్ హష్మీపై కీలక సన్నివేశాలను చిత్రీకరించేందుకు చిత్రబృందం ముంబైకి వెళుతోంది. ఈ షెడ్యూల్ మే 18, 2025న ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.
ఈ చిత్రంలో శ్రీయా రెడ్డి, అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్, షామ్, హరీష్ ఉత్తమన్ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. షూటింగ్ మరియు ఇతర పనులు పూర్తయ్యాక విడుదల తేదీని అధికారికంగా ప్రకటించనున్నారు.
Also Read:ఒకే రాష్ట్రం.. ఒకే రాజధాని:లోకేష్

