రివ్యూ : ఆఫీసర్

271
officer review
- Advertisement -

నాగార్జున, రామ్ గోపాల్ వర్మ.. వీరిద్దరిది క్రేజీ కాంబినేషన్. వీరి కాంబినేషన్ లో వచ్చిన శివ, గోవిందా..గోవిందా టాలీవుడ్ బ్లాక్ బస్టర్‌ హిట్‌ సినిమాలుగా నిలిచాయి. చాలా సంవత్సరాల తర్వాత మళ్లీ వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం ఆఫీసర్. కర్ణాటకకు చెందిన ఐపీఎస్ ఆఫీసర్ కె.ఎం.ప్రసన్న జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఇవాళ ప్రేక్షకుల ముందుకువచ్చింది. మరి ఆఫీసర్‌తో నాగ్ ఆకట్టుకున్నాడా..? వర్మ సక్సెస్ బాట పడ్డాడా లేదా చూద్దాం

కథ:

పోలీస్ ఆఫీసర్ నారాయన్ పసారి ఎన్‌కౌంటర్‌లో ముగ్గురి పోలీసులను చంపేస్తాడు. ఈ కేసుపై సీరియస్‌ అయిన కోర్టు ఇన్వేస్టిగేషన్ చేయాలని ఆదేశిస్తుంది. ఇందుకోసం శివాజీ రావు(నాగార్జున)ను నియమిస్తుంది. ఈ కేసు ఇన్విస్టిగేషన్‌ కోసం హైదరాబాద్ నుంచి ముంబైకి చేరుకుంటాడు నాగ్. నాగ్ చేప‌ట్టిన సిట్ ఆఫ‌రేష‌న్ ఫెయిల్ చేసేందుకు ఆ గ్యాంగ్ నాగ్‌ను చంపేక్ర‌మంలో అత‌డి భార్య‌ను చంపేస్తుంది. ఆ త‌ర్వాత నాగ్ విల‌న్ గ్యాంగ్‌ ఆట ఎలా కట్టించాడు..? అన్న‌దే ఆఫీస‌ర్ క‌థ‌.

ప్లస్ పాయింట్స్ :

సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్స్ నాగార్జున రోల్‌,ఫ‌స్టాఫ్‌లో డిఫ‌రెంట్ స్టోరీ లైన్‌,సంగీతం, నాగ్‌కు పాప‌కు మ‌ధ్య వ‌చ్చే ఎమోష‌న‌ల్ సీన్లు. ఐపీఎస్ ఆఫీసర్‌గా నాగ్ జీవించాడు. బెస్ట్ పర్ఫామెన్స్‌తో యాక్షన్‌,ఎమోషనల్ సీన్స్‌లో అద్భుతంగా వేరియేషన్‌ పండించాడు. తొలి సినిమానే అయినా మైరా సరీన్‌ చక్కని నటన కనబర్చింది. బేబి కావ్య పర్వాలేదనించగా  అజయ్ పోలీస్ ఆఫీసర్ గా మెప్పించాడు. మిగితా వారు తమ పరిధిమేరకు ఆకట్టుకున్నారు.

Image result for nagarjuna officer

మైనస్ పాయింట్స్:

సినిమాకు మేజర్ మైనస్ పాయింట్స్ స్క్రిన్ ప్లే,నిర్మాణ విలువలు,డైలాగ్‌లు,వీక్‌గా ఉన్న క్యారెక్ట‌ర్లు. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గాను, ఎమోష‌న‌ల్‌గా క‌నెక్ట్ చేయ‌డంతో ఎంట‌ర్‌టైన్‌మెంట్ మిస్ అయ్యింది.

సాంకేతిక విభాగం:

సాంకేతికంగా సినిమా సో సో అనిపిస్తుంది. రవిశంకర్ సంగీతం బాగుంది, ముఖ్యంగా పాపతో వచ్చే నవ్వే నవ్వు సాంగ్ చాలా బాగుంది. కొన్ని స‌న్నివేశాల్లో నేప‌థ్య సంగీతం కూడా మెప్పించింది. ఎడిటింగ్ బాగుంది. నిర్మాణ విలువల్లో ఇంకాస్త శ్రద్ధ తీసుకుంటే బాగుండేది. వర్మ సినిమాలంటే క్వాలిటీకి అద్దం పట్టేవి. కానీ ఈ సినిమాలో భూతద్దం పెట్టి వెతికినా ఎక్కడా హై స్టాండర్డ్‌  వాల్యూస్ కనిపించవు.

Image result for nagarjuna officer

తీర్పు:

దాదాపు 28 ఏళ్ల తర్వాత వర్మ-నాగ్ కాంబినేషన్‌లో వచ్చిన మూవీ ఆఫీసర్‌. నాగార్జున రోల్,సంగీతం,ఎమోషనల్ సీన్లు సినిమాకు ప్లస్ కాగా డైలాగ్‌లు,స్క్రీన్ ప్లే మైనస్ పాయింట్స్. ఓవరాల్‌గా నాగార్జున కెరీర్ ప‌రంగా మంచి సినిమాయే అయినా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదని చెప్పాలి.

విడుదల తేది:01/06/2018
రేటింగ్:2/5
నటీనటులు:నాగార్జున,మైరా సరీన్
సంగీతం:రవిశంకర్
నిర్మాత:సుధీర్ చంద్ర,ఆర్జీవీ
దర్శకత్వం: రాంగోపాల్ వర్మ

- Advertisement -