టీజర్‌తో వస్తున్న మోహన్ లాల్…

261
mohanlal odiyan
- Advertisement -

మలయాళ సూపర్ స్టార్ మోహన్‌ లాల్ హీరోగా ప్రముఖ దర్శకుడు విఎ కుమార్ డైరెక్షన్‌లో తెరకెక్కిన సినిమా ఒడియన్‌. తెలుగు,మలయాళంలో తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్‌ 14న ప్రేక్షకుల ముందుకురానుంది.100 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రంపై భారీ ఆశలు పెట్టుకున్నారు మోహన్ లాల్.

ఇవాళ సాయంత్రం 4 గంటలకు ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేయనున్నారు. ఇంతవరకూ మోహన్ లాల్ ఎన్నో ప్రయోగాత్మక చిత్రాలు చేశారు. ఆ చిత్రాల సరసన ఈ సినిమా నిలుస్తుందని అభిమానులు భావిస్తున్నారు.

ఈ సినిమా కోసం మోహన్ లాల్ తెగ కష్టపడుతున్నాడు. 55 సంవత్సరాల వ్యక్తిగా 30 ఏళ్ల యువకుడిగా విభిన్న పాత్రల్లో నటిస్తున్నారు. ఇందుకోసం యెగా, వ్యాయామాలు చేసి త‌న వ‌య‌సుని 55 సంవ‌త్స‌రాల నుండి 30 సంవ‌త్స‌రాలు కనిపించేలా శరీరాన్ని మార్చుకొని న‌టించారు.

- Advertisement -