వారంలో ఇద్దరితో పెళ్లి.. మరో యువకుడితో పరార్..

205
odisha girl

పెళ్లంటే వందేళ్ల జీవితం.. ఒక్కసారి మూడు ముళ్లు పడ్డాయంటే ఆ వ్యక్తితోనే ఉండాలనేది మన భారతీయ సంస్కృతి. అలాంటిది ఓ అమ్మాయి చేసిన పనికి, ఆమె తల్లిదండ్రులే, కాదు వారి బంధువులు, స్నేహితులు కూడా తల్లదించుకునేలా చేసింది. ఈ ఘటన ఒరిస్సా రాష్ట్రంలోని కొరాపుట్ లో జరిగింది. తల్లి దండ్రులు కూతురికి పెళ్లి చేసి అత్తవారింటికి పంపించగా.. ఆ యువతి తన భర్తతో రెండు రోజులు మాత్రమే ఉంది. తరువాత తన భర్తతోనే, తాను ఓ యువకుడిని ప్రేమించానని ఆ యువకుడిని పెళ్లి చేసుకుంటానని చెప్పేసింది.

odisha

పోలీసుల సమక్షంలో ఆమె తల్లిదండ్రులు, భర్త చూస్తుండగానే పూల దండలు మార్చుకుని, లవర్ ని పెళ్లి చూసుకుంది. ఆ రెండో భర్తతోనూ ఐదు రోజులు మాత్రమే ఉంది. మరుసటి రోజు కనిపించలేదు. తన భార్య కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఆ యువతి రెండవ భర్త. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులకు ఆశ్చర్యకర విషయం తెలిసింది. ఆ యువతి మరో యువకుడితో సైకిల్ పై వెళ్లిపోయిందని, తాము చూశామని యువతి బంధువులే చెప్పడంతో పోలీసులు ఆశ్చర్యపోయారు.

ఆ యువతి క్యారెక్టర్ అర్థంకాక పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. వారం రోజులలోనే ఇద్దరు పెళ్లి చేసుకుని మరో వ్యక్తితో వెళ్లిపోవడంతో తల్లిదండ్రులు, బంధువులు సిగ్గుపడుతున్నారు. ఆ యువతిని పట్టుకోవడం కోసం ఆ యువతి ఫోటోలు అన్ని పోలీస్ స్టేషన్లకు పంపించారు. ఆ యువతి రెండవ భర్తతో కలిసి ఉన్న ఫోటోలు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.