OTT:ఓదెల 2 ఇంకా సస్పెన్సేనా?

5
- Advertisement -

అశోక్ తేజ దర్శకత్వంలో మిల్కీబ్యూటీ తమన్నా హీరోయిన్‌గా తెరకెక్కిన చిత్రం ఓదెల 2. తమన్నా ప్రధానపాత్రలో నటిస్తుండగా లేడీ అఘోరాగా తమన్నా విశ్వరూపం చూపించింది. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించగా ఓదెల మల్లన్న స్వామి తన గ్రామ ప్రజలను దుష్ట శక్తుల నుంచి ఏ విధంగా కాపాడారు? అన్నదే ఈ చిత్రం కథాంశంగా తెరకెక్కింది.

ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ భాషలలో అందుబాటులో ఉన్నప్పటికీ, విడుదలకు ముందు మలయాళం మరియు కన్నడ భాషలతో కూడిన ఐదు భాషల్లో స్ట్రీమింగ్ చేస్తామని అమెజాన్ ప్రైమ్ వీడియో హామీ ఇచ్చింది. అయితే డిజిటల్ విడుదలకు ఐదు రోజులు గడిచినా మలయాళం, కన్నడ వెర్షన్లు ఇంకా అందుబాటులోకి రాలేదు. దీనిపై అమెజాన్ నుండి ఎలాంటి అధికారిక సమాచారం కూడా వెలువడలేదు.

ప్రచారంలో భాగంగా మల్టీ లాంగ్వేజ్ రిలీజ్ అంటూ హైప్ క్రియేట్ చేసినప్పటికీ, ఇప్పటికీ కొన్ని భాషలలో సినిమా విడుదల కాకపోవడం వల్ల అనేక మంది ప్రైమ్ వీడియో సభ్యులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యపై ఓడెలా 2 చిత్రబృందం స్పందిస్తారా లేదా అన్నది చూడాలి.

Also Read:ప్రధాని మోదీ…ప్రసంగం

- Advertisement -